మాస్ మహారాజ్ రవితేజ తో నేల టిక్కెట్టు అనే సినిమాను తీసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్నారై రామ్ తాళ్లూరి. అయితే ఈసినిమా ఆయనకు నష్టాలను తీసుకొచ్చింది. మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా అంతో ఇంతో శాటిలైట్ రైట్స్ రూపంలో కొంచెం గట్టెక్కాడు. ఈ సినిమా తరువాత మరోసారి రవితేజనే నమ్మి  సినిమా చేశాడు రామ్ తాళ్లూరి. అదే డిస్కో రాజా... ఈఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో భారీగా నష్టపోయాడు. నేల టిక్కెట్టు కు పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ డిస్కోరాజా కు బానే ఖర్చు చేశాడు. అలా తీసిన రెండు సినిమాలు రామ్ తాళ్లూరికి షాక్ ఇచ్చాయి. 
 
అయితే ఇంత నష్టాల్లో కూడా  ఈనిర్మాత  విరాళం ను ప్రకటించాడు. కరోనా ఫై పోరుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తాజాగా 5లక్షల విరాళం ను ప్రకటించిన రామ్ తాళ్లూరి సినీ కార్మికుల కోసం 50వేల రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను పంపిణి చేశాడు. ఇక రామ్ తాళ్లూరి ,రవితేజ తోనే మూడో సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అన్ని కుదిరితే ఇది మల్టీ స్టారర్ అయ్యే అవకాశాలుకూడా లేకపోలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రవితేజ కలిసి విక్రమ్ వేద రీమేక్ లో నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఎలాగు పవన్ తోపాటు రవితేజ తో  రామ్ తాళ్లూరికి మంచి అనుబంధం వుంది. సో ఈ మల్టీ స్టారర్ కనుక ఉంటే ఆయనే  నిర్మించే అవకాశాలు కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: