ప్రస్తుతం కరోనా కారణంగా దాదాపు ప్రపంచమంతా లాక్ డౌన్‌లోనే ఉంది. దీంతో ఎప్పుడూ బిజీ లైప్‌లో బిజీగా ఉండే తారలు ఇప్పుడు ఫ్రీ టైం దొరకటంతో రకరకాల యాక్టివిటీస్ తో బిజీ అవుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో అవేర్‌నెస్ కలిగించేందుకు సేఫ్ హ్యాండ్‌ చాలెంజ్ పేరుతో చేతులు ఎలా కడుక్కోవాలొ చూపించారు స్టార్స్.

 

తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ చాలెంజ్ తెర మీదకు వచ్చింది. లాక్‌ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి సెలబ్రిటీలు ఎక్కువగా వర్క్ అవుట్ వీడియోస్‌ను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. అయితే అందుకు కొనసాగింపుగా హాట్‌ బ్యూటీ నేహా శర్మ ఓ డిఫరెంట్ చాలెంజ్‌ను తెర మీదకు తీసుకువచ్చింది. తన సోషల్ మీడియా పేజ్‌లో టీ షర్ట్ చాలెంజ్‌ను పోస్ట్ చేసింది నేహా శర్మ.

 

ఈ చాలెంజ్ లో భాగంగా చేతుల మీద నిలబడి గోడకు కాళ్లు ఆనించి టీ షర్ట్‌ ను వేసుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన నేహా తన చెల్లెలు ఐషా శర్మను ఈ చాలెంజ్‌ స్వీకరించాల్సిందిగా సూచించింది. ఈ వీడియోతో పాటు స్టే హోం, స్టే సేఫ్‌ అంటూ అభిమానులకు సూచించింది నేహా శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: