షూటింగ్స్ లేవు, టెన్షన్స్ లేవు.. ఖాళీగా ఉండి ముద్దు గుమ్మలు కలలుకంటున్నారు. తమ కలలరాకుమారుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ స్వీట్స్ డ్రీమ్స్ లో మునిగితేలుతున్నారు. షూటింగులు లేక , పెద్దగా టెన్షన్లు లేక బిందాస్ గా ఉన్నారు కాబట్టి.. లైఫ్ గురించి ఆలోచిస్తూ..లీజర్ గా ఉన్నారు . అందుకే పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి.. లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంట్లో వాళ్లుకూడా పెళ్లి గురించి పోరు పెడుతున్నారు . సో .. చేసుకుంటే ఎలా ఉంటుందని సీరియస్ గానే ఆలోచిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా ఇక పెళ్లి చేసుకునే టైమొచ్చింది అంటోంది. సౌత్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ.. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. భారతీయుడు 2 సినిమాతో పాటు , చిరంజీవి సినిమాలో చేస్తోంది. ఈ సినిమాల తరవాత ఇంకే సినిమాలు పెద్దగా నచ్చడం లేదని , ఇక లైఫ్ లో సెటిల్ అవ్వడానికి టైమ్ వచ్చింది అనిపిస్తోందని అంటోంది కాజల్.
నయనతార కూడా ఈ ఇయర్ లోనే ఓ ఇంటిదవ్వబోతోంది. డైరెక్టర్ , ప్రొడ్యూసర్ అయిన విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న నయన్.. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటోందని న్యూస్ విపరీతంగా చక్కర్లుకొడుతోంది. మరో సీనియర్ హీరోయిన్ తమన్నా.. కూడా తన కలలరాకుమారుడి గురించి ఆలోచిస్తోంది. ప్రేమ అనేది మంచి అనుభూతి అని.. ఇప్పటివరకూ నేనది ఫేస్ చెయ్యలేదని అంటూనే.. నా కలలరాకుమారుడు ఎప్పుడొస్తాడో అని వెయిట్ చేస్తున్నా అంటోంది. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని అంటున్నారని.. సో చేసుకుంటే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నానని చెబుతోంది.
సౌత్ మొత్తం చుట్టేస్తున్న త్రిష కూడా అంతే. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. ఇక ఎన్నాళ్లని ఈ సోలో లైఫ్.. నేను కూడా మ్యారీడ్ లైఫ్ టేస్ట్ చూస్తానంటోంది. ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్న త్రిష.. ఈ సారి ఆ తప్పు చెయ్యనంటోంది. నన్ను నన్నుగా ఇష్టపడే వాడు దొరకినప్పుడు అస్సలు ఏమాత్రం ఆలోచించకుండా చేసేసుకుంటానంటోంది త్రిష.