ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో వణికిపోతున్నాయి. చైనా నుండి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు తమ తమ ప్రజలను సామజిక దూరం పాటించేలా ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ లు ప్రకటించగా మన దేశాన్ని కూడా 21 రోజలు లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అయితే దీని వలన అట్టడుగు వర్గాల వారు పని లేక, తద్వారా తినడానికి తిండికూడా లేని పరిస్థితులు ఎదురుకావడంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి ఫ్రీ రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా అందిస్తున్నాయి. 

 

అయితే ప్రభుత్వాలతో పాటు ప్రజలను తమవంతుగా ఆదుకోవడం బాధ్యత అంటూ అనేక రంగాలకు చెందిన పలువురు తమకు వీలైన సాయాన్ని అందిస్తున్నారు. ఇక మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి కూడా ఇప్పటికే ఎందరో ప్రముఖులు తమకు వీలైనంతలో విరాళాలు అందించారు. ఇక ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షల చొప్పున రూ.1 కోటి తో పాటు సినీ రోజువారీ కార్మికుల కోసం కరోనా విపత్తు నిధికి రూ. 25 లక్షల విరాళం అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొద్దిరోజులుగా ప్రజలను ఈ మహమ్మారి పట్ల జాగ్రత్త వహించాలని  కోరుతూ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు పోస్టులు పెట్టారు. 

 

ఇక  కాసేపటి క్రితం నేడు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో రెండు పోస్టులు పెట్టిన మహేష్, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, ముఖ్యంగా రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పినా తక్కువే అని, అలానే మన ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ ప్రజలకు ఈ లాకౌట్ సమయంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నాయని అన్నారు. అయితే ఇప్పటికే ఈ లాకౌట్ ని విజయవంతం చేసిన ప్రజలు, ఇలానే పూర్తిగా సహకరించి ఎవరికి వారు తమ ఇళ్లకే పరిమితం అయితే, తప్పకుండా ఈ మహమ్మారి మన నుండి అతి త్వరలో పారిపోతుందని, అందుకే కరోనా పై చేస్తున్న యుద్ధంలో అందరం కలిసి గట్టిగా పోరాడి దానిని మన దేశం నుండి తరిమి కొడదాం అంటూ మహేష్ పిలుపునిచ్చారు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: