ఈ ఏడాది సినిమాలను నిర్మించే ఆలోచన నుంచి నిర్మాతలు బయటకు వచ్చినట్టే కనపడుతుంది. దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు వినోద కార్యక్రమాల విషయంలో కాస్త కఠినం గా ఉండటమే మంచిది అనే భావంలో కేంద్రం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు జనాలు ఒక చోటకు వచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా దాదాపుగా రద్దు చేసారు. దేశంలో కూడా క్రికెట్ మ్యాచులు గాని సినిమాలు గాని ఏ ఒక్కటి విడుదల కావడం లేదు. 

 

మన దేశంలో సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక నిర్మాతలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతుంది. దేశంలో ఈ ఏడాది సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదు కాబట్టి... సినిమాలను నిర్మించకుండా చూడాలని భావిస్తున్నారు. కరోనా దేశంలో ఒక్క కేసు ఉన్నా ప్రమాదమే. ఇంకా ఇప్పట్లో అది అదుపులోకి వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. 

 

మందు అందుబాటులోకి వచ్చినా అది మాత్రం మాట వినే పరిస్థితి చాలా వరకు లేదు. కాబట్టి ఇప్పుడు సినిమాలను నిర్మించి వాటికి భారీగా ఖర్చు చేసి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని నిర్మాతలు అందరూ భావిస్తున్నారు. దేశ వ్యాప్తం గా కూడా ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నారు. అగ్ర నిర్మాతలు కూడా వద్దు అనే భావనలో ఉన్నారు. సినిమాలను అనుకున్న తేదీ లోపు విడుదల చేసే అవకాశాలు కనపడటం లేదు. కాబట్టి నిర్మించడం మానుకుంటే మినహా ఉపయోగాలు ఉండవు అని నష్టపోవద్దు అని భావిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: