ప్రపంచం మొత్తం కంటికి కనిపించని సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని విలవిలలాడి పోతున్నది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ పై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో వేసవికాలం వస్తే థియేటర్లలో కొత్త సినిమాల సందడి మాములుగా ఉండదు. అలాంటిది కరోనా వైరస్ గత రెండు వారాలుగా థియేటర్లను మూసి ఉంచేలా చేసింది. ఈ టైంకి దేశ ప్రజలంతా వారి వారి అభిమాన సినీ తారల సినిమాలను థియేటర్లలో కుటుంబ సమేతంగా వీక్షించేవారు. ఎల్లప్పుడూ పబ్లిక్ తో కిటకిటలాడే థియేటర్లను మూసివేయడంతో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

 

టాలీవుడ్ లో చాలా సినిమాలు కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. కరోనా కారణంగా విడుదల కాకుండా ఆగిన సినిమాలలో టాప్ టాలీవుడ్ సినిమాల జాబితా ఇలా ఉంది. ఈ లిస్టులో మొదటగా యాంకర్ ప్రదీప్ '30రోజుల్లో ప్రేమించడం ఎలా?', పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన', అనుష్క 'నిశ్శబ్దం', రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా', నేచురల్ స్టార్ నాని 'వి', రామ్ హీరోగా 'రెడ్', మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్', పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా 'రొమాంటిక్', నాగచైతన్య, సాయిపల్లవిల 'లవ్ స్టోరీ', దగ్గుబాటి రానా పాన్ ఇండియా మూవీ 'అరణ్య'.. ఇలా చాలా సినిమాలు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇవేగాక అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', మెగాస్టార్ 'ఆచార్య' సినిమాలు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. చూడాలి మరి కరోనా పోయే వరకు వెయిట్ చేస్తారో.. లేక డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాలన్నీ తమ విడుదల తేదీలను మార్చుకొని ఎప్పుడు థియేటర్లలో కనువిందు చేయనున్నాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: