ప్ర‌ధాని, ముఖ్యమంత్రి సహాయనిధికి తమిళ స్టార్ హీరో అజిత్ రూ.1 కోటి 25ల‌క్ష‌ల భారీ విరాళం అంద‌జేశారు. సినిమాల్లోనే కాదు..నిజ జీవితంలోనూ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు అజిత్‌.శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు..  సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు కొంత‌మంది  సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌కు చెందిన చాలా మంది హీరోయిలుగా ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌చ్చి విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 

 

తాజాగా అజిత్ త‌న భారీ విరాళాన్ని ప్ర‌క‌టించడంతో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లోనే కాదు..దేశ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌లైవా..అంటూ పొగుడుతున్నారు. అజిత్.. ప్ర‌ట‌కించిన మొత్తం విరాళంలో ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు మరియు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి రూ. 25 లక్షల విరాళం అంద‌జేయ‌నున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో దక్షిణాది చిత్ర సీమలో ప‌నిచేసే ఎంతో సినీ కార్మికుల‌కు పని లేకుండా పోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్ సినీ నటులు కరోనా క్రైసెస్ ఛారిటీని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. 

 

ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్థిక సాయం అంద‌జేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 354 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4421కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా 117 మంది చనిపోయారు.  ఈనేప‌థ్యంలో లాక్‌డౌన్  ఇప్ప‌ట్లో ఎత్తివేసే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అదే జ‌రిగితే వేల కోట్ల వ్యాపారం ఆగిపోతుంద‌ని నిర్మాత‌లు టెన్ష‌న్‌..టెన్ష‌న్‌గా ఉన్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: