స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగులోనే కాదు కేరళలో కూడా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే బన్ని తన ప్రతి సినిమా మలయాళంలో కూడా రిలీజ్ చేస్తాడు. అక్కడ దాదాపు స్టార్ హీరో ఇమేజ్ ఉన్న బన్ని కోసం అక్కడ స్పెషల్ గా ఫ్యాన్స్ అసోషియేషన్స్ ఏర్పడ్డాయి. అంతేకాదు బన్ని సినిమాలంటే బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. అల్లు అర్జున్ సినిమాలు హిందీ డబ్బింగ్ వాటికే మంచి డిమాండ్ ఉంది. 

 

తెలుగులో సూపర్ హిట్టైనా కాకున్నా.. ఇక్కడ యావరేజ్ అయిన సినిమాలకు కూడా బాలీవుడ్ లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ సరైనోడు హిందీ వర్షన్ యూట్యూబ్ లో దుమ్ముదులిపేసింది. బాలీవుడ్ ఆడియెన్స్ యూ తెలుగు మాస్ సినిమాలపై మోజు ఏర్పడింది. అందుకే మన సినిమాలకు అక్కడ మంచి హైప్ ఏర్పడుతుంది.  అయితే బన్ని సినిమాలు చూస్తూ అక్కడ హీరోయిన్స్ కూడా అతని మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. 

 

రీసెంట్ గా దిశా పటాని సౌత్ స్టార్స్ లో బన్ని డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన సినిమా ఛాన్స్ రావాలె కానీ మరో నిమిషం ఆలోచించకుండా ఓకే చేస్తానని అంటుంది దిశా పటాని. తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైనా ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో తర్వాత అవకాశాలు దక్కించుకోలేదు. అయితే ప్రస్తుతం దిశ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అక్కడ స్టార్స్ తో క్రేజీ మూవీస్ చేస్తుంది. 

 

బన్ని సినిమా ఛాన్స్ అంటే తప్పకుండా చేస్తా అంటుంది దిశా పటాని. తెలుగు హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టమంటున్న దిశా మరో తెలుగు ఆఫర్ రావాలె కానీ ఈసారి తన సత్తా ఏంటో చూపిస్తా అంటుంది. బాలీవుడ్ లో కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: