టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ మెగా మార్క్ తనపై లేకుండా చాలా తెలివిగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ విషయం ఇటీవల తన స్పీచ్ లు వింటుంటే అర్థం అవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తనకంటూ మంచి పబ్లిషింగ్ వచ్చే విధంగా సెపరేట్  టీం కూడా పెట్టుకున్నాడు బన్నీ. చాలావరకు సౌత్ ఇండియాలో పీఆర్ విష‌యంలో అల్లు అర్జున్ ని కొట్టే మొనగాడు లేరని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. సినిమాల గురించి మరియు అతడు పర్సనల్ విషయాల గురించి జరిగే ప్రచారం చూస్తే వాటిని సోషల్ మీడియాలో వచ్చే ఆదరణ బట్టి అందరికి ఇట్టే అర్థమవుతుంది.

 

బన్నీ ఇటీవల నటించిన 'అల వైకుంఠ పురం లో' సినిమా పీఆర్ విష‌యంలో టీం బాగా పని చేయడంతో సౌత్ ఇండియాలోనే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన పాటలు సృష్టించిన రికార్డులు మరే సినిమా సృష్టించలేదు. అటువంటిది మరికొద్ది రోజుల్లో అనగా ఏప్రిల్ 8 వ తారీకు బన్నీ పుట్టినరోజు సందర్భంగా పీఆర్ టీం అభిమానుల కోసం కామ‌న్ డిస్ ప్లే పిక్ త‌యారు చేయించారు. అది చూశాక బ‌న్నీ అండ్ కో ప్లానింగే వేర‌ని అర్థ‌మ‌వుతోంది.

 

ఆ పిక్ లో బన్నీతో చేసిన దర్శకులు ఫోటోలు అదేవిధంగా బన్నీకి ఏ ఏ భాషలో ఆదరణ ఉందో ఆ భాషలలో పుట్టినరోజు శుభాకాంక్షలు అని దాదాపు పదమూడు భాషలలో విషెస్ చెప్పడం ఇలాంటివి చేశారు. మొత్తంమీద చూసుకుంటే బన్నీతో ఒక బ్రాండ్ ను ఉండేవిధంగా ఆ ఒకే ఒక్క ఫోటో తో కథ నడిపించారు బన్నీ పీఆర్ టీం సభ్యులు. మరోపక్క డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఓ అదిరిపోయే పిక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: