ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో వణికిపోతున్నాయి. ఈ వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికాయే కుదేలైపోతోంది. అలాంటి వైరస్.. భారతదేశంలోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసుల కుప్పులుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నాలుగు వేల మందికిపైగా కరోనా సోకింది. వందకుపైగా ప్రాణాలను కోల్పోయారు. చైనా నుండి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారిని త్వరితగతిన తరిమికొట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు తమ తమ ప్రజలను సామాజిక దూరం పాటించేలా ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ లు ప్రకటించగా మన దేశంలో కూడా లాకౌట్ చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. అయితే దీని వలన అట్టడుగు వర్గాల వారు పని లేక, తినడానికి తిండికూడా లేని పరిస్థితులు ఎదురుకావడంతో ప్రభుత్వాలు ముందుకు వచ్చి వారికి ఫ్రీ రేషన్ తో పాటు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా అందిస్తున్నాయి.

 

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న సమయంలో ప్రజల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు సినీ తారలు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. పేదలకు ఆర్థికంగాను, సామాజికంగాను సహాయం చేయడానికి సిద్దమయ్యారు. ప్రతీ రోజు ప్రజలను, అభిమానుల్లో ధైర్యాన్ని నింపుతూ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్‌ను విధించడంతో ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో కరోనాను కాస్త కట్టడి చేయగలిగారు కానీ పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. అయితే కరోనా సంగతి పక్కన బెడితే.. వాటిపై వస్తున్న ఫేక్ న్యూస్‌ పెద్ద తలనొప్పిగా మారుతోంది. వీటిపై స్వయానా ముఖ్యమంత్రి కూడా మాట్లాడేవరకు వచ్చిందంటే..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

కేసీఆర్ మాట్లాడుతూ.. తప్పుడు వార్తలు రాసేవారికి కరోనా రావాలని, అప్పుడు వారికి కూడా బాధ అర్థమవుతుందని ఫైర్ అయ్యాడు. తాజాగా ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశాడు. కొందరు కావాలనే అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.. అలాంటి వాటిని రిపోర్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేయండి.. అలాంటి వారిని ఊరికే వదలొద్దు.. అంటూ సిటీ కమీషనర్, పోలీస్ డిపార్ట్ మెంట్‌కు సూచించాడు. అంతేకాకుండా డాక్టర్లపై దాడి చేస్తే మూడేళ్ళ వరకు జైలు అంటూ పేపర్ కటింగ్ కూడా పోస్ట్ చేసాడు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దంటూ, అలాంటి వార్తలను నమ్మొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: