ల‌వ్ అండ్ రొమాంటి చిత్రాలు డిఫ‌రెంట్ గా తీసుకెళ్ళే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. అయితే ఇప్పుడు ది గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నంకే ఓ హీరోయిన్ ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. భార‌తీయ సినీ తెర‌పై మ‌ణిర‌త్నంది చెర‌గ‌ని సంత‌కం. ఆయ‌న నుంచి వ‌చ్చిన చిత్రాల్నీ ఆణిముత్యాలే. జాతీయ స‌మ‌గ్ర‌త‌రి చాటిచెప్పిన ఆయ‌న సినిమాలు ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌లే. అలాంటి ద‌ర్శ‌కుడికే ప్ర‌పోజ్ చేసిందో హీరోయిన్‌. ఈ దృశ్యం మూడేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో జ‌రిగినా తాజాగా దీన్ని బ‌య‌ట పెట్టింది ఈ భామ‌.

 

మూడేళ్ల క్రితం కార్తి హీరోగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం `కాట్రు వెలియిడై`. ఇదే చిత్రాన్ని తెలుగులో `చెలియా` పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రం కాస్త స్లోగా ఉండ‌డం వ‌ల్ల బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. సినిమా దారుణమైన ఫ‌లితాన్నిచ్చినా ఈ చిత్రంలోని పాట‌ల‌కీ, ఫొటోగ్ర‌ఫీకి మాత్రం మంచి పేరొచ్చింది. ఇక మ‌ణిర‌త్నం సినిమాలు దాదాపుగా అంద‌రికీ న‌చ్చ‌వు. ఈయ‌న సినిమాలు కాస్త ఎక్కువ డీప్ ఎనాలిసిస్‌తో అర్ధం చేసుకోవాల్సి వ‌స్తుంది. 

 

ఈ చిత్రంలో కార్తికి జోడీగా బాలీవుడ్ భామ అదితీరావు హైద‌రీ న‌టించింది. ఈ సినిమా సెట్‌లో ఓ రోజు స‌ర‌దాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంకు అదితీరావు హైద‌రీ ఓ రోజ్ ఫ్ల‌వ‌ర్‌ని అందిస్తూ ప్ర‌పోజ్ చేయ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ట‌. ఆ త‌రువాత అదితి స‌ర‌దాగా ఆట‌ప‌ట్టిస్తోంద‌ని తెలిసి అంతా న‌వ్వుకున్నార‌ట‌. ఈ స‌ర‌దా సంఘ‌ట‌న‌కు సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఫొటోని తాజాగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా త‌న అభిమానుల‌తో పంచుకుంది అదితీరావు హైద‌రీ. ఈ ఫొటో ప్ర‌స్తుతం ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఇప్పుడు నెటిజ‌న్లు అంతా ఈ ఫొటోకి ర‌క ర‌కాల కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: