తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఇలియానా ఓ దశలో చక్రం తిప్పింది. 2006లో దేవదాసు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సాధించంది ఈ గోవా బ్యూటీ. గ్లామర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి యూత్ ను హార్ట్ త్రోబ్ గా మారిపోయింది. హీరోయిన్ గా దక్షిణాది భాషా సినిమాల్లో తొలిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్ ఇలియానా. తెలుగులో కెరీర్ జెట్ స్పీడ్ లో ఉండగా బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ అక్కడ కూడా రాణించలేకపోయింది. దీంతో తెలుగులో కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది.

 

 

ప్రస్తుతం అరకొర సినిమాలతో నెట్టుకొస్తున్న ఇలియానా ఇకపై సినిమాలు మానేసే ఉద్దేశంలో ఉందని తెలుస్తోంది. ఈ వార్త అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో కూడా రౌండ్ అవుతోంది. ఇకపై హీరోయిన్ గా ట్రై చేయడం కంటే యాంకరింగ్ చేయడం బెస్ట్ అని భావిస్తోందట. ఇందుకు ఓ స్పోర్ట్స్ చానెల్ ఆమెను యాంకరింగ్ చేయాలని సంప్రదించడంతో ఈ నిర్ణయంపై ఆలోచిస్తోందట. ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు ఇచ్చేందుకు బాలీవుడ్ తో సహా టాలీవుడ్ కూడా సిద్ధంగా లేదని అర్ధమైందట ఇల్లూ బేబీకి. దీంతో యాంకరింగ్ అంటే జెంటిల్ గానూ ఉంటుంది.. క్రేజ్ కూడా రన్ అవుతుందని భావిస్తోందట.

 

 

ప్రస్తుతం ఈ విషయంపై ఇలియానా ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదట. బాలీవుడ్ లో ఓ సినిమాకు సైన్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తెలుగులో కూడా మాస్ మహారాజ్ రవితేజ్ సినిమాకు సైన్ చేసే ఉద్దేశంలో ఉందని టాలీవుడ్ సమాచారం. ఈ రెండు కమిట్ మెంట్లు పూర్తయ్యాకే ఇలియానా యాంకరింగ్ ఫీల్డ్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై అఫిషియల్ న్యూస్ ఇలియానా నుంచే రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: