స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2020 సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ ని అందుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్టించాడు. అంతేకాదు ఈ సినిమాతో బన్నీ తన కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగాను రికార్డ్ నెలకొల్పాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా గురూజీ కి తన ఖాతాలో గొప్ప సినిమాగా నిలిచింది.

 

ఇక ప్రస్తుతం బన్నీ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 సినిమా తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం ఎంతో కసితో ఈ సినిమాని చేస్తున్నారు బన్నీ సుకుమార్. ఇక ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ముందు నుంచి శేషాచలం అనే టైటిల్ అనుకున్నారు సుకుమార్ టీం. కాని తాజాగా ఈ సినిమాకు 'పుష్ప' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఇలాంటి ఈ టైటిల్‌తో విక్టరీ వెంకటేష్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. గతంలో వెంకటేష్ నటించిన లక్ష్మీ, తులసి సినిమాలు సూపర్ హిట్ ని అందుకున్నాయి.

 

ఈ టైటిల్స్ అనుకున్నప్పుడు లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్ కరెక్ట్ కాదేమో అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. కాని వెంకీ అవే టైటిల్స్ తో సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కూడా వెంకీని ఫాలో అవ్వాలనుకున్నారు. ఆ తరహా టైటిల్స్ ని పెట్టాలని కూడా కొన్ని టైటిల్స్ రిజిస్టర్ చేపించారు. అయితే వెంకటేష్ మాదిరిగా ధైర్యం చేయలేకపోయారు.

 

ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న భయం తో వాళ్ళు ఎప్పుడు ఎలాంటి టైటిల్స్ పెట్టుకుంటారో అలాంటి టైటిక్స్ తోనే కంటిన్యూ అయ్యారు. కానీ బన్నీ మాత్రం ఫస్ట్ టైం ధైర్యం చేసి పుష్ప అన్న టైటిల్ ని పెట్టుకున్నారు.  ఇప్పుడు బన్నీ కూడా అదే విధంగా వెంకీని ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా కన్నడ బ్యూటి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: