అప్ప‌ట్లో తెలుగు సినిమా అంటే  తెలుగు ద‌నాల ఆడ‌ప‌డుచులా క‌ళక‌ళ‌లాడ‌తా క‌నిపించేది. అప్ప‌ట్లో ఎంద‌రో అగ్ర క‌థానాయ‌కులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, సోభ‌న్‌బాబుల‌తో పాటు, సావిత్రి, భానుమ‌తి కూడా తెలుగు ద‌నానికి ప్ర‌తీక‌గా నిలిచేవారు. అస‌లు భానుమ‌తి అయితే స్వ‌త‌హాగా క‌వ‌యిత్రి సంగీత విధ్వ‌సురాలు కూడా. త‌న పాట‌ను త‌నే రాసి త‌నే సంగీతం స‌మ‌కూర్చి త‌నే పాడుకుంటుంది. ఇక ఎన్టీఆర్ సంగ‌తి స‌రేస‌రి తెలుగుద‌నానికి నిద‌ర్శ రూపం. త‌నే రాసి త‌నే ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డం కాదు. త‌నే అందులో బ‌హుపాత్ర‌ల‌ను పోషించేవారు. అంత తెలుగు ద‌నం ఉట్టిప‌డే తెలుగు సినిమాల‌కు ప్ర‌స్తుతం క‌థానాయ‌కులంతా ఇత‌ర భాషా ప్రాంతాల వారే. ఇక వీరికి తెలుగు భాష రాక‌పోవ‌డాన్ని ఎలాగోలా స‌ర్దుకుపోవ‌చ్చు. అదే మ‌న తెలుగుప్రాంతానికి  హీరోలు తెలుగు పండితులుకారు క‌దా ప‌ర‌మ శుంఠ‌లుగా త‌యారయ్యారు. అయితే వీరిలో ఫ‌స్ట్ ప్లేస్ మ‌న మ‌హేష్ బాబుదే అని చెప్పాలి.ఇక తెలుగు సినిమాలు తీసుకుంటే ఎన్నో సినిమాల్లో మ‌హేష్ తండ్రి కృష్ణ మూల‌పురుషుడులా క‌నిపిస్తారు.

 

ఇక అదే మ‌న మ‌హేష్‌బాబుకి తెలుగులో అక్ష‌రం ముక్క రాదు. ఇప్పుడు చ‌ప్పండ్రా అబ్బాయిలు వాట్ టు డూ  వాట్ డూ టు అని ఇంత పెద్ద డైలాగులు తెర‌మీద చెపుతాడు గాని అయితే అదంతా ఇంగ్లీష్‌లో రాసుకుని తెలుగులో బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డ‌మే. ఇక ఈయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త అంటే ఏదో పొరుగు రాష్ట్రంలో పుట్టిన అమ్మాయి కాబ‌టి ఓకే మ‌రి ఈయ‌న ఒక‌ప్పుడు సూప‌ర్‌స్టార్ హీరో కొడుకు 50కి పైగా తెలుగు అక్ష‌రాలు నేర్చుకుంటే ఏం పోద్ది అంటే స‌మాధానం లేదు. అస‌లు మ‌హేష్‌బాబు శ్రీ‌మంతుడులా మారి గ్రామాలు ద‌త్త‌త తీసుకోవ‌డం మాట అటు ఉంచితే బ‌డి పండులుగా మారి ఎవర‌న్నా ఇత‌ని మ‌న‌లో ఎవ‌ర‌న్నా భాషా అజ్ఞానాన్ని ద‌త్త‌త తీసుకోవాలి. తెలుగు పూర్తిగా నేర్పించాలి. పైపెచ్చు ఈ హీరోగారు ఓ సారి ఏమ‌న్నారంటే... పెద్ద పెద్ద డైలాగులు ఉంటే లాగ్ అయిపోతాయి అంటారు. కాని అది ల్యాగ్ ప్రోబ్ల‌మ్ కాదు. ల్వాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్‌. 

 

మ‌రో వ్య‌క్తి ఎవ‌రంటే... ఈమెకు స‌హ‌జ‌న‌టి అన్న పేరుంది. అల‌నాటి తెలుగు క‌థానాయిక‌ల్లోనే అగ్ర తార‌గా పేరుంది. కానీ తెలుగు మాత్రం అక్ష‌రం ముక్క కూడా రాదు. య‌స్ మీరు ఊహించింది క‌రెక్టే జ‌య‌సుధ‌కు తెలుగు రానేరాదు. త‌న కెరియ‌ర్ స్టార్టింగ్‌లో జ్ఞాప‌క‌శ‌క్తి బాగా ఉండ‌డం వ‌ల్ల చెప్పే డైలాగ్ విని కంఠ‌త ప‌ట్టి చెప్పేసేది. ఇప్పుడు వ‌య‌సు మీద ప‌డ్డాక జ్ఞాప‌క‌శ‌క్తి అంతంత‌మాత్రంగా త‌యార‌యింది. దీంతో ప‌దే ప‌దే ప్రామ్‌ప్టింగ్ అడుగుతున్నార‌ట‌. 

 

ఇక మంచుల‌క్ష్మి తెలుగులో అమ్మాయిగారిది ఒక ప్ర‌త్యేక భాష‌గా త‌యార‌యింది. తెలుగును టెంగ్లీష్‌గా క‌న్‌వ‌ర్ట్ చేసిన ఘ‌న‌త ఈ అమ్మ‌డిదే. తెలుగు ఫాంట్‌కంటూ కొన్ని పేర్లు ఉంటాయి. అలాగే తెలుగులో మంచు ల్యాంగ్వేజ్ అంటూ ఒక‌టి ఫామ్ అయిందంటే...అది ఈ అమ్మ‌డి చ‌ల‌వే. తండ్రి 500 చిత్రాల‌కు పైగా న‌టించారు. తెలుగు డైలాగులు చెప్ప‌డంలో దిట్ట అని చెప్పాలి. డైలాగ్ కింగ్‌గా పేరున్న వాడు అలాండి తండ్రి క‌డుపున పుట్టిన ల‌క్ష్మి తండ్రి పేరేకాదు తెలుగు భాష‌ను కూనీ చేసేస్తోంది. ఇక మంచువిష్ణు తెలుగులో త‌న పేరు త‌ను రాసుకోవ‌డం స‌రికాదుక‌దా త‌న పేరు కూడా తాను స‌రిగా ప‌ల‌క‌లేడు.ఎందుకంటే అత‌నికి నోరే తిర‌గ‌దు. అత‌ని మాట వింటుంటే ఇంత‌టి మ‌హాన‌టుడు క‌డుపున ఇలాంటి వారా అనిపిస్తుంది. ఇక మంచు మ‌నోజ్ ప‌రిస్థితి కూడా దాదాపు అంతే.

 

తెలుగు చిత్ర సీమ మెగాస్టార్‌రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ది కూడా సేమ్ సీనే. తెలుగు తెలియ‌దు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుగు అక్ష‌రాల‌ను గుర్తు ప‌ట్టే స్టేజ్‌కి వ‌చ్చాడు. ముంబై హీరోయిన్ల‌కంటే కాస్త బెట‌ర్ అట ఈయ‌న తెలుగు. అక్కినేని అఖిల్ తాత నాగేశ్వ‌ర‌రావు తెలుగు సినిమా రెండు క‌ళ్ళ‌లో ఒక‌ర‌న్న పేరు. తండ్రి నాగార్జున తెలుగు హీరోల్లో ఒక‌ర‌న్న ఖ్యాతి. ఏదో అంద‌రూ తెలుగులో మాట్లాడ‌టం వ‌ల్ల ఆ కాస్త మాట్లాడ‌టం వ‌చ్చింది. లేదంటే అదీ లేదు. పొట్ట‌కోస్తే తెలుగు అక్ష‌రం రాదు. ఇలా ఇండ‌స్ట్రీలో చాలా మంది మ‌న‌తెలుగు వాళ్ళే తెలుగు రాకుండా ఉన్నారు. ఇంకా రానా, హీరో సుశాంత్‌, నిహారిక‌, హీరో శ్రీ‌కాంత్‌, ఆయ‌న కొడుకు రోష‌న్ ఇలా వీళ్ళ‌ల్లో ఎవ్వ‌రికీ తెలుగు తెలియ‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: