అక్కినేని నట వారసుడు అఖిల్ నితిన్ నిర్మాణంలో వినాయక్ డైరక్షన్ లో వచ్చిన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ బడ్జెట్ అదిరిపోయే హంగులతో రాగా ఆ సినిమా తుస్సుమనిపించింది. ఇక ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరక్షన్ లో హలో అంటూ ఒక స్వీట్ క్యూట్ లవ్ స్టోరీతో వచ్చినా అది కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకోలేదు. ఇక అఖిల్ థర్డ్ మూవీ మిస్టర్ మజ్ను కూడా రిలీజ్ ముందు బాగానే హంగామా చేసినా ఆఫ్టర్ రిలీజ్ మళ్ళీ నిరాశరచింది. 

 

మూడు సినిమాలు చేసినా మూడు ఫెయిల్యూర్ అవడంతో అఖిల్ కొద్దిగా నిరుత్సాహపడ్డాడు. ఇక కొద్దిపాటి గ్యాప్ తో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో అయినా అతని కల నెరవేరుతుందో లేదో చూడాలి. అయితే అఖిల్ మూడు ఫెయిల్యూర్స్ ఊహించినవి కాకపోయినా అఖిల్ సినిమా నుండి మిస్టర్ మజ్ను వరకు అఖిల్ తన సొంత నిర్ణయం మేరకే సినిమాలు చేస్తున్నాడు. 

 

తండ్రి నాగార్జున సలహాలు తీసుకోగానే అఖిల్ హిట్టుకి డోరామయ్యడని కొందరు అంటున్నారు. అఖిల్ ఫెయిల్యూర్ కు ఒక కారణం అదేనని.. అతని అనుభవం లేమి కథల ఎంపికలో తెలుస్తుందని.. అందుకే ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండట్లేదని అంటున్నారు. హలో విషయంలో నాగార్జున హెల్ప్ తీసుకున్నా సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.

 

కొందరు హీరోలు ఇలా సినిమా చేస్తే అలా హిట్ అవుతుంటే అఖిల్ కు మాత్రం హిట్టు కొట్టడం ఒక పెద్ద టాస్క్ గా మారింది. భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న మూవీ అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయట. ఆల్రెడీ సూపర్ హిట్లతో ఫామ్ లో ఉన్న గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుండి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా అఖిల్ కు హిట్టు ఇస్తుందని ఆశిస్తున్నారు. మరి అఖిల్ కోరిక బ్యాచ్ లర్ తీరుస్తాడా లేదో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: