టాలీవుడ్ లో అల్లు అర్జున్ కాస్త విభిన్న శైలి ఉన్న హీరో. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే తనకు మాత్రం ప్రత్యేక గుర్తింపు కోసమే అతను ఎక్కువగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తండ్రి ఇమేజ్ తో అతను కెరీర్ లో దాదాపుగా నిలబడ్డాడు. మెగా ఫాన్స్ కి ఎక్కువగా వాడుకున్న సందర్భం అంటూ అతని కెరీర్ లో పెద్దగా ఏదీ లేదు అనే చెప్పాలి. ఇక మెగా ఫాన్స్ మీద విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తనకు ఫాన్స్ లేరు ఆర్మీ ఉన్నారు అంటూ అతను వ్యాఖ్యలు చేసిన సందర్భం ఇటీవల మనం చూసాం. 

 

ఇక ఇది పక్కన పెడితే అతను నందమూరి అభిమానులకు బాగా దగ్గరైన హీరో. అతని సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా క్లాస్ గానే ఉంటున్నాయి. నందమూరి అభిమానులు ఎక్కువగా క్లాస్ సినిమాల దృష్టి పెడుతూ ఉంటారు. అందుకే అల్లు అర్జున్ అంత త్వరగా వారికి దగ్గరయ్యాడు అనేది కొందరి మాట, ఇక ఎన్టీఆర్ తో అతను ఎప్పుడూ స్నేహం చేస్తూనే ఉన్నాడు. అభిమానుల హడావుడి మినహా అల్లు అర్జున్ మాత్రం ఎన్టీఆర్ కి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాడు. ఇటీవల తన సినిమా సందర్భంగా బన్నీ కి మద్దతుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా లో పోస్ట్  చేసిన సంగతి తెలిసిందే. 

 

ఆ తర్వాత నందమూరి అభిమానులు సంక్రాంతికి విడుదల అయిన అల్లు అర్జున్ సినిమాను ఎక్కువగా చూసారు. ఇక అక్కడి నుంచి వారి ఆలోచన కూడా మారింది అనే చెప్పాలి. అల్లు అర్జున్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే సినిమాలు చేయడం గమనార్హం. సాధారణంగా మెగా ఫ్యామిలీ ఎక్కువగా... మాస్ సినిమాలు చేస్తూ ఉంటుంది. కాని బన్నీ మాత్రం ఆ జోనర్ నుంచి ఎక్కువగానే బయటకు రావడానికి ట్రై చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: