అసలే ఆపసోపాలు పడుతూ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఈ కరోనా  గోల తో మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది. ఆ.. ఇంక సినిమా షూట్ జరిగినట్టే... జనవరి న రిలీజ్  అయ్యినట్టే అని అనుకుంటున్నారు అందరూ.  ఎంతో ప్రెస్టిజియస్ గా రాజమౌళి స్టార్ట్ చేసిన ఆర్‌ ఆర్ ఆర్ సినిమా  జులై లో రిలీజ్  అన్నాడు.. కాదుకాదు తూచ్.. వచ్చే జనవరి అన్నాడు. సినిమా జనవరిలో రిలీజ్ అని ఏ ముహూర్తాన అన్నాడో ..మళ్లీ షూటింగ్ కి అవాంతరాలు వచ్చిపడ్డాయి. కరోనా వచ్చి షూటింగులు ఆగిపోయాయి.

 

రామ్ చరణ్ కి హీరోయిన్ గా వచ్చిన ఆలియా కూడా వెళ్లిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా వస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా మీద రోజుకో న్యూస్ బయటికొస్తోంది.  నెక్ట్స్ జనవరికి రిలీజ్ అని రాజమౌళి అనౌన్స్ చేస్తే.. అసలుసినిమా షూట్ అయిపోతేనేకదా.. ఆన్ టైమ్ రిలీజ్ అయ్యేది.. అంటూ డౌట్స్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. ఎవ్వరెలా అనుకున్నా..రాజమౌళి మాత్రం..ఆ సారి డేట్ మార్చే ప్రసక్తే లేదు అంటున్నాడు.

 

అంతేకాకుండా ఆల్రెడీ సినిమా ఫామ్ లోనే ఉందనడానికి  రామ్ చరణ్ బర్త్ డే కి రెడీ చేసిన వీడియో బెస్ట్ఎగ్జాంపుల్ . నెక్ట్స్‌ మన్త్ లో రాబోతున్న ఎన్టీఆర్  బర్త్ డేకి కూడా ఇలాంటి ఎలక్ట్రిఫైయింగ్ విజువల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి అండ్ టీమ్.  షూటింగ్ లేదు కదా అని ఖాళీగా టైమ్ పాస్ చెయ్యకుండా ఈ సారి సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవ్వకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి.

 

ఎట్టి పరిస్తితుల్లో రిలీజ్ పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదంటున్నాడు జక్కన్న. ఎందుకంటే.. ఆలియా భట్ భట్ మే నుంచి ఆర్.ఆర్.ఆర్ షూట్ లో జాయిన్ అవుతోంది. ఒక్కసారి షూటింగ్ ట్రాక్ ఎక్కిందంటే ఇక అదేఫ్లో లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఎక్కడా డిలే అయ్యే ప్రసక్తే లేదు. అంతేకాదు.. ఈ కరోనా లాక్ డౌన్ పీరియడ్ లో ఖాళీ గా ఉండకుండా  గ్రాఫిక్ వర్క్ చేయిస్తున్నట్టు చెప్తున్నారు మేకర్స్. అంటే లాక్ డౌన్‌ పూర్తయ్యే సరికి సినిమా పోస్టో ప్రొడక్షన్‌ వర్క్ చాలా వరకు పూర్తి చేయ్యాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: