రీసెంట్ గా  అలవైకుంఠపురం లో అదిరిపోయే ఆడియోతో , మోత మోగిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.  ఆ రీ సౌండ్ ఇంకా సోషల్ మీడియాలో రికార్డుల రూపంలో వినిపిస్తూనే  ఉంది. ఈ సినిమా హిట్  అయిన దెబ్బతో  వరుస పెట్టి ఆఫర్లొచ్చేశాయి.  వాటిలో ది బెస్ట్ మూవీ  పవన్ కళ్యాణ్ తో చేస్తున్న వకీల్ సాబ్ అనే చెబుతున్నాడు తమన్. అలవైకుంఠపురంలో  సక్సెస్ లో అందరి అంచనాల ను ఒకే సారి పెంచేశాడు తమన్. దట్ టూ.. పవన్ కళ్యాణ్ సినిమా  ఆఫర్ రాగానే   అందరి చూపు తమన్ వైపుకే వెళ్లింది.

 

ఇప్పటివరకూ పెద్దగా ఎమోషనల్ సినిమాలకు  అంత ఇంటెన్సివ్ మ్యూజిక్  ఇవ్వని తమన్ .. వకీల్ సాబ్  లాంటి ఎమోషనల్ మూవీకి  ఎలా ఇస్తాడో అని ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా  పవన్ కళ్యాణ్ తో  ఫ్యాన్  మూమెంట్ ని షేర్ చేసుకున్న తమన్.. వకీల్ సాబ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నానంటున్నాడు . ఈ మద్యనే స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ ఛాన్స్‌ కొట్టేస్తున్న తమన్ కి తనను తాను ప్రూవ్ చేస్కోడానికి వకీల్ సాబ్ మంచి ఛాన్స్ అంటున్నాడు తమన్.

 

ప్రజెంట్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మంచి ఫామ్ లోఉన్న  తమన్ ని నమ్మి.. తన కమ్ బ్యాక్ మూవీని ఇచ్చాడు  పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ లాంటి ఎమోషనల్ డ్రామా కి మ్యూజిక్ కత్తి మీద సామే అయినా..  ఈ సినిమా హిట్ తో తెలుగులో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్  గా సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయ్యాడు.  అందుకే పవన్ తనమీద నిలబెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం డిసప్పాయింట్ చెయ్యకుండా మ్యూజిక్ రెడీ చేస్తున్నానంటున్నాడు తమన్.

 

బాలీవుడ్‌ సూపర్‌  హిట్ పింక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న  ఈ సినిమాను తెలుగులో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పూర్తిగా హిందీ సినిమాలా కాకుండా పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా తెలుగు వర్షన్‌లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: