మెగా ఫ్యామిలీ లో అల్లు అర్జున్ వ్యవహారశైలి కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది.అందరి కంటే భిన్నంగా అతను ఆలోచనలు చేస్తూ ఉంటాడు. చిరంజీవి నీడలో అతను హీరో అయినా సరే తర్వాత తర్వాత మాత్రం మెగా ఫ్యామిలీ కి చాలా వరకు దూరంగా ఉంటూ వచ్చాడు అనేది వాస్తవం. ముఖ్యంగా మెగా ఫాన్స్ మీద అతను పరోక్షంగా విమర్శలు చేయడం అందరూ ఆశ్చర్యపోయారు. అతని సినిమాలు కూడా మెగా ఫాన్స్ ఎక్కువగా చూస్తూ ఉండే వారు కాదు. ఇక దీనికి కారణం ఏంటీ అనేది ఎవరికి స్పష్టంగా అర్ధం కాలేదు. కాని మెగా ఫ్యామిలీ కి మాత్రం అతను దూరం అనేది అర్ధమైంది. 

 

ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ కి వరుణ్ తేజ్ కి మధ్య విభేదాలు ఉన్నాయని కొంత కాలం క్రితం నుంచి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అతని విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాడని అంటూ ఉంటారు మెగా ఫాన్స్. దానికి కారణం నాగబాబు అని సమాచారం. నాగ బాబు కాస్త దూకుడు మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మీద అతను విమర్శలు చేస్తూ వచ్చాడని ఇది మెగా ఫాన్స్ లో ఒక వర్గానికి నచ్చలేదు అని అలాగే... మెగా ఫాన్స్ తో పాటుగా అల్లు అర్జున్ కి చికాకు పెట్టింది అని అంటున్నారు.

 

ఇక తన తమ్ముడు విషయంలో కూడా నాగబాబు విమర్శలు చేసారని అది అల్లు అర్జున్ కి అసలు నచ్చలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే వరుణ్ తేజ్ కి చాలా వరకు బన్నీ దూరంగా ఉంటాడు అనేది కొందరి మాట. అందుకే కొన్ని కొన్ని సినిమా కార్యక్రమాలకు అతన్ని ఆహ్వానించినా సరే వెళ్ళే అవకాశం ఉండదు అని అంటూ ఉంటారు. ఈ మధ్య ఇది మరీ ఎక్కువైంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: