అల్లు అర్జున్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్‌స్టార్ గుర్తు వ‌స్తారు. మ‌ల్లూఅర్జున్ అంటే కేర‌ళ‌లో అభిమానులు ఊగిపోతారు. బ‌న్నీ అని పిలిచినా.. అల్లూఅర్జున్ అని పిలిచినా.. ప‌లికేది స్టైలిష్‌స్టార్ మ‌న అల్లుఅర్జునే. వీడు హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి హీరో అంటే వీడురా అనే స్ధాయి వ‌ర‌కు చేరాడు.న‌మ్ముకోవ‌ల‌సింది రెడీమేడ్‌గా ఉన్న అభిమాన సంఘాన్ని కాదు క‌ష్ట‌ప‌డి సంపాదించిన అభిమానుల్ని అని ఆయ‌న అన్నారు. త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్టైల్‌ని ఏర్ప‌రుచుకుని స్టైలిష్‌స్టార్‌గా ఎదిగారు అల్లుఅర్జున్‌. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజుసంద‌ర్భంగా ఇండియా హెరాల్డ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపు ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి...

 

ఏప్రిల్ 8 1983లో ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅరవింద్, నిర్మ‌ల‌కు చెన్నైలో జ‌న్మించాడు అల్లుఅర్జున్‌. అయితే ఈయ‌న పుట్టిన మూడేళ్ళ వ‌ర‌కు కూడా అత‌నికి పేరు పెట్ట‌లేదు. అందుకే అంద‌రూ బ‌న్నీ అని పిలిచేవారు. ఆ త‌ర్వాత నాలుగ‌వ సంవ‌త్స‌రంలో ప‌ద్మ శేషాద్రి స్కూల్‌కి తీసుకువెళ్ళిన్న‌ప్పుడు అక్క‌డ ఉన్న స్కూల్ టీచ‌ర్ అల్లుఅరవింద్‌ని మీ అబ్బాయి పేరేంటి అని అడిగితే ఇంకా పేరు పెట్ట‌లేదు అన‌డంతో టీచ‌ర్ ఆశ్చ‌ర్య‌పోయి అప్ప‌టిక‌ప్పుడు బియ్యం తెప్పించి అ తో మొద‌లైన పేరు చూసి అర్జున్ అని సెలెక్ట్ చేశారు. ఆ పేరు అంద‌రికి న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చేశారు. అలా బ‌న్నీ నామ‌క‌ర‌ణం జ‌రిగింది. అలా మూడేళ్ళ వ‌ర‌కు పేరు లేక‌కుండా ఉన్న ఏకైక వ్య‌క్తి మ‌న అల్లూవారి అబ్బాయి. ఎంత క‌ష్ట‌ప‌డి చ‌దివినా..మార్కులు మాత్రం అర‌కొరే వ‌చ్చేవ‌ట‌. దీంతో అర‌వింద్ ఓ సారి అర్జున్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి బాగా చ‌దువుకోవాలిన మంద‌లించారు. అర్జున్ మొద‌టిసారి చిరంజీవి విజేత చిత్రంలో మంజుల కొడుకుగా న‌టించాడు. ఆ త‌ర్వాత క‌మ‌ల్‌హాస‌న్ మ‌న‌వ‌డు స్వాతిముత్యంలో న‌టించాడు. ఈ రెండు సినిమాల్లో అర్జున్ కావాల‌ని న‌టించలేదు. అనుకోకుండా యాధృచికంగా న‌టించాడు అంతే.అర్జున్‌కి అన్న‌య్య వెంక‌టేష్‌, త‌మ్ముడు శిరీష్ ఇద్ద‌రు ఉన్నారు. వాళ్ళిద్ద‌రికంటే కూడా చిన్న‌ప్పటి నుంచి యాక్టివ్‌గా ఉండేవాడు. అర్జున్‌కి చిన్న‌ప్ప‌టి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.చిన్న‌ప్ప‌టి నుంచి కూడా చ‌ర‌ణ్‌, బ‌న్నీ ఇద్ద‌రూ బాగా డ్యాన్స్‌లు చేసేవారు.

 

చిరంజీవి న‌టించిన డాడి సినిమాలో ఓ డ్యాన్స్ పాత్ర చేయించారు. అర్జున్‌కి బొమ్మ‌లు వేయ‌డం కూడా బాగా వ‌చ్చు. దాంతో యానిమేష‌న్ కోసం కెన‌డాలో ఫీజు కూడా క‌ట్టారు అర‌వింద్ కానీ అర్జున్‌కి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్ర‌స్ట్‌తో హీరో అవ్వాల‌ని ముంబ‌యిలోని కిషోర్ న‌మిద్ స్కూల్ వ‌ద్ద యాక్టింగ్ నేర్చుకుని హీరో అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: