బాలీవుడ్ నటి షెఫాలి షా కు వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో విలవిలలాడుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ తమ వక్రబుద్ధి చూపిస్తున్నారు కొంత మంది ఆకతాయిలు. ప్రజులంతా ఇళ్లకే పరిమితమై బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్న సమయంలో వారిని మరింతగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతున్నారు.

 

కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో పరిస్థితి దారుణంగా ఉంది. సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇదే అదునుగా ఆకతాయిలు చెలరేగిపోతున్నారు.

 

బాలీవుడ్‌ నటి షెఫాలి షాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె ఫేస్‌ బుక్‌ ఎకౌంట్ ను హ్యాక్ చేసిన కొందరు ఆకతాయిలు తాను తన కుటుంబ సభ్యులు కోవిడ్ 19 పాజిటివ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా ఫెఫాలికి సందేశాలు రావడం మొదలైంది. ఆమె పట్ల కన్సర్స్‌ చూపిస్తూ కొంత మంది మెసేజ్‌లు చేయగా మరికొందరు మేము పలానా రోజు మిమ్మల్ని కలిశాం అంటూ తమ ఫోన్‌ నెంబర్లు షేర్‌ చేశారు.

 

అయితే ఈ విషయంపై స్పందించిన షెఫాలి. అసలు విషయాన్ని బయట పెట్టింది. తనకు గానీ తన కుటుంబ సభ్యులకు కానీ కరోనా లేదని, ఎవరో తన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ను హ్యాక్ చేసిన ఇలా తప్పుడు ట్వీట్ చేశారని పేర్కొంది షెఫాలి. అయితే తన మీద అంతటి ప్రేమాభిమానాలు చూపించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Posted by Shefali Shah on Tuesday, april 7, 2020

మరింత సమాచారం తెలుసుకోండి: