టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లి అయి వార్తల్లో ఎక్కువగా నిలిచే హీరోల్లో అల్లు అర్జున్ మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ ముందు వరలో ఉంటారు. వారు... ప్రతీ సందర్భంలోనూ తమ ఫ్యామిలీ ని బయటపెడుతూ ఉంటారు. పండగకో ఏదోక కార్యక్రమానికో ఇదే విధంగా ఆలోచిస్తూ వాళ్ళను బయటపెడుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం కొందరు అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు కొందరు. ఫ్యామిలీ ని బయటకు తీసుకు రావడం ఈ రోజుల్లో మంచిది కాదు అనేది కొందరి అభిప్రాయం. 

 

అయితే అల్లు అర్జున్ విషయానికి వస్తే అతను ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు అనేది కొందరి మాట. టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఇప్పుడు హాట్ టాపిక్. అతను పిల్లల వీడియో లు ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాడు. వారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు బన్నీ. వారి స్కూల్ అయినా వారి డ్రెస్ అయినా ప్రతీ ఒక్కటి అతను చాలా జాగ్రత్తగా చూస్తాడట. ఎక్కడా కూడా వాళ్ళకు లోటు రాకుండా భార్య మీద భారం వేయకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా... 

 

అతను ఎక్కువగా కేర్ తీసుకుని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడని వాళ్ళను ఎక్కువగా మొబైల్స్ కి దగ్గరగా ఉండనిచ్చే ప్రయత్నం చేయరు అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇక తన ప్రతీ సినిమాకు వాళ్ళను తీసుకు వెళ్లి చూపిస్తాడని సినిమా ప్రతీ విషయం వాళ్లకు చెప్తాడని అంటున్నారు. చిన్న పిల్లలు అయినా సరే ప్రతీ విషయం వాళ్లకు చెప్తాడని అంటున్నారు. భార్య తో కూడా అన్ని విషయాలను పంచుకునే ప్రయత్నం చేస్తాడని అంటున్నారు. ఆమె అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సినిమా కథ విషయంలో ఆమె సూచనలు తీసుకుంటాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: