కరోనా ఎఫెక్ట్‌ తో సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మన స్టార్స్‌లోని రొమాంటిక్ యాంగిల్ కూడా బయటకు వస్తోంది. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే  తారలు.. ఇప్పుడు కాస్తంత సమయం దొరకటంతో తమ పార్ట్‌నర్స్‌తో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే రణబీర్‌ అలియా, టైగర్‌ ష్రాష్‌, దిశా పటానీలు ఒకే ఇంట్లో ఉంటున్నట్టుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.

 

తాజాగా ఈ లిస్ట్‌ లోకి మరో బాలీవుడ్‌ హాట్ జోడి కూడా చేరిపోయింది. బాలీవుడ్‌ కండల వీరుడు, ఏజ్ బార్ బ్యాచిలర్‌ సల్మాన్‌ ఖాన్‌ కొంత కాలంగా విదేశీ భామ లులియా వాంతూర్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలతో డేటింగ్ చేసిన సల్మాన్, ప్రస్తుతం లులియాతో రిలేషన్‌లో ఉన్నాడు. సల్మాన్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా తరుచూ కనిపించే లులియా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా సల్మాన్‌తోనే ఉంటుందట.

 

తాను సల్మాన్‌తో ఉంటున్నట్టుగా డైరెక్ట్‌గా చెప్పకపోయినా సల్మాన్‌తోనే ఉంటున్నట్టుగా అభిమానులకు హింట్ ఇచ్చింది లులియా.. `నేను భద్రమైన ప్లేస్‌లో ఉన్నందుకు ఆనందంగా ఉన్నా.. సిటీకి దూరంగా ప్రశాంతంగా` అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్‌ కూడా సిటీకి దూరంగా ఉన్న తన పాన్వెల్‌ ఫాం హౌస్‌లో ఉంటున్నాడు. ఈ ఖాళీ సమయంలో తన నెక్ట్స్ సినిమా రాధే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు సల్మాన్‌.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

It has been a while... #iuliavantur #horseriding #beauty #life #sunday #staysafe #isolation

A post shared by Iulia Vantur (@vanturiulia) on

మరింత సమాచారం తెలుసుకోండి: