ప్రస్తుతం ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ గా కొనసాగుతున్న చిరంజీవి నుండి పిలుపు వస్తే ఆ పిలుపుకు స్పందించకుండా మౌనం వహించడానికి చాల ధైర్యం ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి ధైర్యాన్ని దర్శకుడు మారుతి వ్యూహాత్మకంగా ప్రదర్శించాడా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఫిలిం కెరియర్ పై చాల టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా చిన్నల్లుడు నటించిన విజేత మూవీ ఫెయిల్యూర్ కన్నా ఆ మూవీకి వచ్చిన అతి తక్కువ ఓపెనింగ్స్ చిరంజీవిని కూడ ఆశ్చర్య పరిచినట్లు టాక్. వాస్తవానికి మెగా అభిమానులు కూడ కళ్యాణ్ దేవ్ ను లైట్ గా తీసుకోవడం చిరంజీవికి బయటకు చెప్పుకోలేని షాక్ అని అంటున్నారు. 


ఈ పరిస్థితులలో కరోనా సమయం వల్ల ఏర్పడ్డ గ్యాప్ లో కళ్యాణ్ దేవ్ గురించి చిరంజీవి ఆలోచనలు చేస్తూ అతడికి సరైన లిఫ్ట్ ఇవ్వగల దర్శకుడు మారుతి మాత్రమే అని భావించి చిరంజీవి సాయి తేజ్ ద్వారా మారుతికి రాయబారాలు చేయించి ఒక మంచి కథ ఏదైనా ఉంటే కళ్యాణ్ దేవ్ తో సినిమా తీసే విషయాలను ఆలోచించమని కోరినట్లు తెలుస్తోంది. 


అయితే ‘ప్రతిరోజు పండుగే’ మూవీ ఘన విజయం తరువాత మారుతి ఆలోచనలు అన్నీ టాప్ హీరోల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే టాప్ హీరోలు మాత్రం మారుతిని పక్కకు పెడుతున్నారు. దీనితో ఒక మిడిల్ రేంజ్ హీరోతో సినిమా తీయాలని మారుతి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ పరిస్థితులలో కళ్యాణ్ దేవ్ తో సినిమా చేసి ఆసినిమా ద్వారా మెప్పించ లేకపోతే తన కెరియర్ కు గండి పడుతుంది అన్న ఆలోచనలతో మారుతి సాయి తేజ్ రాయబారానికి స్పందిస్తూ ప్రస్తుతం తన వద్ద కళ్యాణ్ దేవ్ కు సరిపడే కథ లేదు అంటూ సున్నితంగా చిరంజీవి ఆఫర్ ను తిరస్కరించాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: