అల్లు అర్జున్ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. సినీ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.. ఇంత గొప్ప స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. మావయ్య మెగాస్టార్ తో కలిసి అతిధిపాత్రలో డాడీ సినిమాలో డాన్సర్ గా నటించాడు..ఆ సినిమాలో పాత్ర చిన్నదే కానీ డాన్స్ మాత్రం దుమ్ముదులిపేసాడు. అందరు చాలా ఆతృతగా ఎదురుచూసారు.. ఎప్పుడు సినిమాలో హీరోగా నటిస్తాడా అని.

 

ఒకపక్క మెగాస్టార్ అల్లుడు, మరోపక్క అల్లు అరవింద్ కొడుకు, పద్మశ్రీ  అల్లు రామలింగయ్య మనవడు. అందుకే మెగా అభిమానుల్లో ఆసక్తి రేగింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మమ్మయ్యది మొగల్తూరు.. మా నాన్నది పాలకొల్లు  అని అందరిని అలరించాడు. తర్వాత ఆర్య, దేశముదురు సినిమాలతో ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు.

 

అల్లు అర్జున్ లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే డాన్స్. ఎటువంటి డాన్స్ అయిన గాని ఇరగదీస్తాడు. ఇప్పుడు ఉన్న టాలీవుడ్ హీరోల్లో టాప్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకడు. గంగోత్రి తరవాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య' గా  యువత మనసులో స్థానం సంపాదించాడు .పరుగు లో తన నటన ఏంటో చూపించి వరస  సినిమాలతో పరుగులు పెట్టాడు.  'వేదం' తో నవతరం నాయకులలో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. తర్వాత వచ్చిన వరుడు కొంచెం నిరాశపరిచింది.

 

అల్లు అర్జున్ కెరీర్లో పెద్ద డిజాస్టర్ లా మిగిలిపోయింది. కొన్ని హిట్లు, కొన్ని ప్లాపులతో అల్లు అర్జున్ కెరీర్ సాగుతుంది. హిట్ వచ్చిందని గర్వపడలేదు అలాగే సినిమా ప్లాప్ అయిందని నిరుత్సహపడలేదు అల్లు అర్జున్.. ఎప్పుడు ఒకేలా ఉంటాడు.. రీసెంట్ గా అలా వైకుంఠ పురం లో సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు.

మరింత సమాచారం తెలుసుకోండి: