స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు తన 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కరోనా దెబ్బకి లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన అల్లు అర్జున్ తన 37వ పుట్టినరోజుని సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటున్నాడు. ఈయన నటనా నైపుణ్యంతో, చలాకీ పెర్ఫార్మెన్స్ తో, హావభావాల వ్యక్తీకరణ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, ఉత్తర భారతదేశంలో కూడా ఎనలేని పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా... తన సినీ కెరీర్ లోని ఐదు గొప్ప సినిమాలు ఏంటో తెలుసుకుందాం.


1. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య అల్లు అర్జున్ సినీ కెరీర్ ని మలుపు తిప్పింది. గంగోత్రి సినిమా విజయవంతం అయినప్పటికీ... రాఘవేంద్రరావు, ఎం.ఎం.కీరవాణి కి పేరు వచ్చింది కానీ అందులో హీరోగా యాక్ట్ చేసిన అల్లు అర్జున్ కి మాత్రం ఎటువంటి క్రెడిట్ దక్కలేదు. కానీ ఆర్య సినిమా లో అల్లు అర్జున్ తన ఎమోషన్స్ తో, సూపర్ డాన్సింగ్ స్కిల్స్ తో, ప్రతి ఒక్కరిని కట్టిపడేసే నటనా ప్రతిభతో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో తాను ఫిజికల్ గా కూడా చేంజ్ అయ్యాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లుఅర్జున్ కెరియర్లో 'ఆర్య' ఎప్పటికీ ఒక గొప్ప సినిమాగా మిగిలిపోతుంది.


2. వేదం సినిమాలో 'కేబుల్ రాజు' పాత్ర అల్లు అర్జున్ సినీ కెరియర్ లో ఓ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం లో అల్లు అర్జున్ నటనా ప్రతిభ ప్రతి ఒక్కరిని బాగా ఏడ్పించేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా 'వేదం' లో అనుష్క శెట్టి ఓ వేశ్య పాత్రలో, మంచు మనోజ్ రాక్ స్టార్ పాత్రలో ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. వ్యభిచారం చేసే మహిళలు ఎలా కృంగిపోతారో, పేద వారి జీవితాలు ఎలా ఉంటాయో, హిందూ ముస్లిం మధ్య ఎటువంటి సంఘటనలు జరుగుతాయో చాలా చక్కగా ఈ సినిమాలో చూపించారు.


3. రాణి రుద్రమదేవి చిత్రంలో అనుష్క శెట్టి టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ తో అందరిని బాగా అలరించగా... అదే చిత్రంలో గోనగన్నారెడ్డిగా అనే ఓ విభిన్నమైన పాత్రలో అల్లు అర్జున్ అత్యుత్తమ నటనా ప్రతిభను చూపించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. అచ్చం నిజమైన గోనగన్నారెడ్డిలా అల్లు అర్జున్ తెలంగాణ యాస లో చేసిన డైలాగ్ డెలివరీ ఎప్పటికీ మన మనసులో మెదులుతుంది. తన కెరియర్ లోని గొప్ప సినిమాల్లో రాణి రుద్రమదేవి ఖచ్చితంగా ఉంటుంది.


4. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ హాస్యభరితమైన నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను అలరించిందంటే అతిశయోక్తి కాదు. కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం, సోనూ సూద్ ఈ సినిమాలో టాప్ నాచ్ పర్ఫామెన్స్ ని అందించి ఓ సూపర్ డూపర్ హిట్ ని అల్లు అర్జున్ కి సంపాదించి పెట్టారు. ఇది కూడా అల్లు అర్జున్ కెరీర్లో ఒక గొప్ప సినిమాగా చెప్పుకోవచ్చు.


5. విలువలే ఆస్తి అనే నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ కి బాగా పేరు తెచ్చిపెట్టింది. రవిశంకర్ వాయిస్ ఓవర్ తో ఉపేంద్ర అద్భుతమైన విలనిజం ఈ సినిమా ద్వారా అశేషమైన తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించాడు. ఆలోచింపజేసే డైలాగులతో, వినాలనిపించే పాటలతో, అందరి టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ తో S/O సత్యమూర్తి అల్లు అర్జున్ సినీ కెరీర్లో ఓ గొప్ప సినిమాగా నిలిచిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: