ఈరోజు ఫాన్స్ అందరు  ఎంతగానో ఎదురుచూసే అల్లు అర్జున్ బర్త్ డే. అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రేత్యేకమైన అభిమానులని సొంతం చేసుకున్నాడు. తన స్టైల్ తో గాని, డాన్స్ తో గాని, నటనతో గాని అభిమానులని ఆకర్షించాడు. అయితే అల్లు అర్జున్ అలా వైకుంఠ పురం సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి ఒక మూవీ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా బన్నీ, సుకుమార్ కాంబినేషన్ అంటే ఎంత క్రెజి కాంబినేషన్.. ! అందుకే అభిమానుల్లో  ఆసక్తి నెలకొంది  ఈ సినిమా గూర్చి. అయితే ఇప్పటికే అల్లు అర్జున  ఏప్రిల్ 8వ తేదిన తన 20వ సినిమాకు సంబంధించిన ఒక ప్రకటన చేయబోతున్నాడని ప్రకటించాడు. ఈ సినిమా  మైత్రీ మూవీస్ బ్యానర్ లో చేస్తన్నారు.. ఇప్పటికే మైత్రి మూవీస్ వాళ్ళు ట్విట్టర్ లో ఒక ప్రకటన కూడా చేసారు. 

 

 


సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘శేషాచలం’ అడవుల నేపథ్యంలో  అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.అయితే ఇంకొక ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘పుష్ప’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారట చిత్రబృందం. సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప అని తెలుస్తోంది. సో సినిమా హీరోయిన్ పేరు మీద వస్తోందన్న మాట. .ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ శేషాచలం అనే రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లో ఏమబ్బా, అందరూ బాగుండారా, మీరు ఎపుడెప్పుడా అని అని చూస్తాండే.

 

 


ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది. రెడీ  కాదండబ్బా అంటూ రాయలసీమ యాసలో ట్వీట్ చేసారు. మొతానికి ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పుటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇపుడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ సర్ఫ్రైజ్ ఇవ్వనున్నట్టు తెలిజేస్తూ ట్వీట్ చేయడం చూసి బన్ని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.  ఈ సినిమాలో బన్ని రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో కనబడుతూ.. లారీ డ్రైవర్‌గా అదరగొడుతాడని సమాచారం. సినిమాలో చాలా వరకు క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ భావించి.. ఆ పాత్రల్లో కొంతమంది కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. బన్నీతో ఈ తాజా చిత్రం కూడా అదే ఫార్ములాతో వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: