మెగా హీరో ట్యాగ్ లైన్ నుండి స్టైలిష్ స్టార్ గా స్క్రీన్ నేమ్ తెచ్చుకునేందుకు అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. అల వైకుంఠపురములో సక్సెస్ తో నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కాడు. గంగోత్రి నుండి అల వైకుంఠపురములో వరకు అల్లు అర్జున్ కెరియర్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. 

 

ప్రతి సినిమాలో తన మార్క్ చూపించడానికి ప్రయత్నించే అల్లు అర్జున్ డిఫరెంట్ గా చేస్తున్నాడు. ప్రతి సినిమా స్టోరీ దగ్గర నుండి సాంగ్స్, కాస్ట్యూమ్స్ ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటాడు. అంతేకాదు పాత్రకు తగినట్టుగా తన మేక్ ఓవర్ విషయంలో కూడా కొత్తగా ప్రయత్నిస్తాడు. ఒక నిర్మాత కొడుకుగా ఇతను ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని అందరు అవాక్కయ్యేలా చేస్తున్నాడు అల్లు అర్జున్.

 

గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ నుండి అల వైకుంఠపురములో అల్లు అర్జున్ వరకు బన్నీతో చాలా పరిణితి వచ్చింది. తన పర్ఫార్మెన్స్ లో కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ లో అల్లు అర్జున్ ఒకరు. బన్ని సినిమా వస్తుంది అంటే బాక్సులు బద్దలు కొట్టేస్తుంది అన్న విధంగా క్రేజ్ వచ్చింది. హీరోగా వచ్చామా చేశామా వెళ్ళామా అన్నట్టు కాకుండా తన సినిమా విషయంలో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేందుకు బన్నీ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. 

 

అందుకే టాలీవుడ్ లీడింగ్ యాక్టర్స్ లో అతను ఒకడయ్యాడు. మెగా హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న బన్నీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కాకుండా తనకంటూ ఒక ఆర్మ్ ఉందని చెబుతున్నాడు. తప్పకుండ బన్ని తన కెరియర్ లో ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తాడని చెప్పొచ్చు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: