ఈరోజు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 37 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దాంతో లక్షలాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా అల్లుఅర్జున్ కలకాలం బ్లాక్ బాస్టర్ సినిమాతో దూసుకుపోవాలని విషెస్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ ను తనదైన శైలిలో చెప్పి నెట్టింట పెద్ద దుమారమే రేపుతోన్నాడు. తాను, అల్లు అర్జున్ కలిసి దిగిన ఓ పాత ఫోటో ని చిరు షేర్ చేసి... 'బన్నీ డాన్స్ లో గ్రేస్, ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీ లోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్తడే బన్నీ, నువ్వు బాగుండాలబ్బా..' అని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.


మైత్రి మేకర్స్ నిర్మాణంలో, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేయడంతో పాటు టైటిల్ ఏంటో కూడా సోషల్ మీడియాలో వెల్లడించాడు. తన నెక్స్ట్ సినిమా పేరు 'పుష్ప' అని ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని కూడా అల్లు అర్జున్ తాజాగా రిలీజ్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాకి సంగీత బాణీలను దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండగా... రష్మిక మందాన కథానాయికగా నటిస్తోంది. పుష్ప టైటిల్ అదిరిపోయింది అని, ఫస్ట్ లుక్ కెవ్వు కేక అని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.


ఏది ఏమైనా తన ప్రియమైన అభిమానుల కోసం అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా ఓ విలువైన సర్ ప్రైజ్ మనీ అభిమానులకి అందించే అందరి మనసులో సంతోషాన్ని నింపేసాడు. మరి ఈ సినిమా అల్లు అర్జున్ కి ఎటువంటి బ్లాక్ బాస్టర్ హిట్ ను సంపాదించి పెడుతుందో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: