వాస్తవానికి అంతకముందు రెండేళ్లుగా సరైన సక్సెస్ లేని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈ ఏడాది జనవరిలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో మొత్తానికి మంచి హిట్ కొట్టి మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఆ సినిమాని ఎంతో భారీగా నిర్మించాయి. 

 

ఇక దాని అనంతరం బన్నీ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ నేడు ఈ సినిమా నిర్మాతలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. నేడు బన్నీ పుట్టినరోజు కావడంతో నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కి సంబందించిన అప్డేట్ కి నిర్మాతలు ఇవ్వడం జరిగింది. ఇక నేడు సరిగ్గా 9 గంటలకు రిలీజ్ అయిన పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్ లో బన్నీ ఫుల్ గా గడ్డం, క్రాఫ్ తో ఉండడం బట్టి చూస్తుంటే ఈ సినిమా మంచి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధం అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  

 

ఇప్పటికే ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ మాస్ పాత్ర పోషిస్తున్నట్లు ఆయన భాషలోని యాసకు సంబంధించి నిర్మాతలు సినిమా అప్డేట్ ఇచ్చే సమయంలో యాస భాషతో ఒక పోస్ట్ పెట్టడంతో ఈ సినిమాలో ఆయన మాస్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పుడే అర్ధం అయింది. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: