తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు ప్ర‌స్తుతం త‌రం హీరోల్లో టాప్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. ఒక‌ప్పుడు చిరంజీవి ఇండ‌స్ట్రీనీ ఎలా ఎలారో ఆ త‌ర్వాత వీరిద్ద‌రే దూసుకుపోతున్నారు. అటు ఈ త‌రం వ‌స్తోన్న హీరోల‌కు.. సీనియ‌ర్ హీరోల‌కు మ‌ధ్య వార‌ధిలా ప‌వ‌న్‌, మ‌హేష్ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు ఇప్ప‌టికే 20 ఏళ్ల సినిమా కెరీర్‌తో పాటు 25 సినిమాలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. వీరిలో మ‌హేష్‌బాబు రాజ‌కుమారుడు సినిమాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో వెండితెరంగ్రేటం చేశారు.

 

ఇప్పుడు ఇంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ఇద్ద‌రు హీరోలు తొలి సినిమాల‌కు ముందు ఏం చేసేవారు ? అప్పుడు ఏం జ‌రిగిందో ?  తెలుసుకుందాం. ఒక్కసారి ఈ ఫోటో చూడండి.. అందులో పవన్, మహేష్ లుక్స్ చూడండి. సినిమాల్లోకి రాకముందు తొలి సినిమా కోసం తీసుకున్న ఫోటోషూట్స్ ఇవి. 1996 ప‌వ‌న్ తొలి సినిమాకు ముందు ఖాళీగా ఉండేవాడు. మ‌నోడు ఈవీవీ. స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకు ముందు ప‌వ‌న్ సినిమాల్లోకి రావాల‌ని అనుకోక‌పోయినా స‌డెన్‌గా సినిమాల్లోకి వ‌చ్చి ఈ రోజు అటు సినిమాల్లో తిరుగులేని స్టార్‌గా ఉండ‌డంతో పాటు రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా ఉన్నారు.

 

ఇక ప‌వ‌న్ సినిమాల్లోకి వ‌చ్చిన మూడేళ్ల‌కు 1999లో రాజకుమారుడు సినిమాతో మహేష్ వచ్చాడు. ఈ ఇద్దరూ తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారు. తండ్రి సూప‌ర్‌స్టార్ కృష్ణ ఇమేజ్ అందిపుచ్చుకుని నేడు స్టార్ హీరోగా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోల‌కు తెలుగులో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇద్ద‌రికి రు. 100 కోట్ల‌కు పైగా మార్కెట్ ఉంది. మ‌హేష్ సినిమాల్లో ఉంటే ప‌వ‌న్ అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లోనూ ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: