ఈ మద్య టాలీవుడ్ లో ఎక్కువగా రిమేక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్’ రిమేక్ గా తెలుగు ‘వకీల్ సాబ్ ’ లో నటిస్తున్నారు.  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.  అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తు్న్నారు. తాప్సి పాత్రలో నివేదా థామస్ నటిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 

 

 ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంగీతం ఎస్ ఎస్ తమన్ అందిస్తున్నారు.  ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు.. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఫిలిమ్ వర్గాల్లో మరో టాక్ వినిపిస్తుంది. ఆ మద్య తమిళంలో వచ్చిన 'విక్రమ్ వేద' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ సేతుపతి - మాధవన్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తెలుగు రైట్స్ ను రామ్ తాళ్లూరి దక్కించుకున్నారు.

 

అయితే ఈ మూవీలో విజయ్ సేతు పతి పాత్రలో పవన్ కళ్యాన్ ని నటింపజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే మాధవన్ పాత్రలో మాస్ మహరాజ రవితేజ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. రామ్ తాళ్లూరికి .. పవన్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందట. అందువలన పవన్ అంగీకరించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. హిందీలోను ఈ సినిమా రీమేక్ అవుతుండటం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: