తెలుగు చిత్ర పరిశ్రమలో స్టైల్ అంటే ఏంటో నిరూపించి తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్ . అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడు గా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యి .. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు. విభిన్నమైన హెయిర్ స్టైల్ అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్... ఆకట్టుకునే డాన్స్ స్టైల్..అద్భుతమైన యాక్టింగ్ స్టైల్ తో  ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్ . గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అల్లు అల్లు అర్జున్ మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్రమక్రమంగా తెలుగు ప్రేక్షకుల స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. 

 

 కాగా ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన 37వ ఏట కి అడుగుపెట్టబోతున్నాడు అల్లు అర్జున్. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ లవ్ స్టోరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. అల్లు అర్జున్ మామూలుగానే మాటకారి అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయి లను ఇట్టే ఆకర్షించగలడు  అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ స్నేహా రెడ్డి అనే బిజినెస్మేన్ కూతుర్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో వీరిద్దరిది  అరేంజ్డ్ మ్యారేజ్ అని అందరూ అనుకున్నప్పటికీ తర్వాత లవ్ మ్యారేజ్ అన్న  విషయం బయటపడింది. అయితే సినిమాలకు అసలు సంబంధం లేని స్నేహ రెడ్డి సినిమా లో సూపర్ స్టార్ గా  ఉన్నా అల్లు అర్జున్ కి మధ్య ప్రేమ ఎలా  పుట్టింది అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 

 

 అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కి సినిమాలతో సంబంధం లేదు.ఈమె  ప్రముఖ బిజినెస్ మెన్  కట్టా శేఖర్ రెడ్డి కూతురు. అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి ఆ తర్వాత ఇండియా  వచ్చాక స్నేహితురాలి వివాహానికి హాజరయ్యింది. స్నేహా రెడ్డి ఫ్రెండ్ అల్లు అర్జున్ కూడా ఫ్రెండ్ అవడంతో అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి వెళ్లారు. అక్కడే అల్లు అర్జున్ స్నేహా రెడ్డి ని చూసి లవ్ లో పడిపోయాడట. ఇక ఆ తర్వాత స్నేహ రెడ్డి తో స్నేహం ఏర్పడటం  తర్వాత ప్రపోజ్ చేయడం తర్వాత ప్రేమలో మునిగి తేలటం  జరిగిపోయాయట. ఇక మొదట వీరి ప్రేమకు మొదట పెద్దలు ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకొని  పెళ్లి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: