తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఫ్యామిలీ మెగా కుటుంబంగా స్థిరపడిపోయింది. చిరంజీవి కుటుంబం నుంచే 8 మంది హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారంటే మెగా కుటుంబం స్థాయి అర్ధమవుతోంది. మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఆదరించడానికి మెగా అభిమానులు సిద్దంగా ఉంటారు. అభిమానుల ఆశలను నిలబెడుతూ నటనలో మెరుగులు దిద్దుకుంటూ మెగా హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తి కోసం మెగా అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. అతడే.. పవన్ కల్యాణ్ కుమారుడు అకిరానందన్. నేడు అకిరా పుట్టినరోజు.

 

 

ఈ సందర్భంగా అకీరా పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు. (6.4”) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. Wish you a “Power”ful future. Happy Birthday Akira!’ అంటూ తన ఆశీస్సులు అందించారు. చిరంజీవి చేసిన ట్వీట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. చిరంజీవి స్వయంగా ట్వీట్ చేయడంతో మెగా అభిమానులకు పూనకాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ‘పవర్’ అనే పదాన్ని స్పెషల్ గా మెన్షన్ చేయడంతో మెగా అభిమానులతో పాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయిపోతున్నారు.

 

 

ఈ ట్వీట్ కు రిప్లైలు కామెంట్లు హోరెత్తిపోతున్నాయి. ‘థాంక్యూ బాస్’, ‘తమ్ముడిని కొడుకులా చూసుకున్నావ్.. తమ్ముడి కొడుకుని కూడా కల్యాణ్ బాబులా చూసుకుంటున్నావ్’, ‘ఈ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాం అన్నయ్యా’.. అంటూ రిప్లై ఇస్తున్నారు. నిజానికి అకీరానందన్ సినిమా ఎంట్ర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరి మెగా అభిమానుల కోరిక, పవన్ ఫ్యాన్స్ ఆశ ఎప్పుడు తీరుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: