శక్తిమాన్... ఈ కార్యక్రమం ఇదివరకు ఎంత విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాలంలో ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో చాలామంది టీవీలకు అతుక్కుపోయే వారంటే నమ్మక తప్పదు. ఎందుకంటే శక్తిమాన్ అందులో చేసే అబ్బురపరిచే సన్నివేశాలు అందులో ఉండడం. 

 

 

ఇక అసలు విషయానికి వస్తే... శక్తిమాన్ గా నటించిన వ్యక్తి ప్రముఖ నటుడు "ముఖేష్ కన్నా". అయితే ఈయన ప్రస్తుతం నిర్మాత ఏక్తా కపూర్ మహాభారతాన్ని చంపేసింది అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. 2008 సంవత్సరంలో వచ్చిన కహానీ హమారా మహాభారతం అనే సీరియల్ ని ఏక్తాకపూర్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఈ సీరియల్ ని మరలా ప్రసారం చేయబోతున్నారు. కాకపోతే ఈ విషయంపై స్పందించిన ముఖేష్ కన్నా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శక్తిమాన్ కొత్త వర్షన్ ను మళ్లీ ప్రసారం చేస్తున్నామని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ఈ సీరియల్ ఏక్తా నిర్మించిన మహాభారతం సీరియల్ తరహాలో ఉండదు అని స్పష్టం చేశాడు. ఎందుకంటే ఆమె తీసిన మహాభారతం సీరియల్లో ద్రౌపది పాత్రకు భుజంపై టాటూ ఉంటుందని తెలిపాడు. మళ్లీ ఆయన చెప్పుకొస్తూ అయితే ఏక్తాకపూర్ మహాభారతాన్ని తీసే ముందే ఆ సీరియల్ ని కొత్తగా తీస్తున్నట్లు తెలిపారని చెప్పాడు.

 

 

ఇకపై నటుడు ముఖేష్ కన్నా మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఎప్పటికీ  ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే మన సంస్కృతి అంతమైపోతుంది అని ఏక్తాకపూర్ పై మండి పడ్డాడు. ఒకవేళ మహాభారతం సీరియల్ పేరు " క్యుంకీ గ్రీక్‌ భీ కబీ హిందూస్థానీ"  అని పెట్టి ఉంటే నేను ఆ సీరియల్ ని సమర్ధించే వాడిని అని తెలిపాడు. అంతేకాక ఈ మహాభారతాన్ని మార్చే హక్కు ఎవరిచ్చారని ఆమెపై విరుచుకుపడ్డాడు. అలాగే మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు కంటే తాను ఎక్కువ తెలివిగా ఉండాలని ప్రయత్నించిందని ఆమెను ఎద్దేవా చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: