ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి అందరివాడిగా పేరు. కలుపుగోలు మనస్తత్వం, అందరి దగ్గరా చనువు ఉన్న వ్యక్తిగా చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తన సమకాలీకులైన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు కుటుంబాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ముఖ్యంగా నాగార్జునతో ఆయనకు అనుబంధం ఎక్కువే. ఏకంగా నాగార్జున ఇటివలి అక్కినేని నాగేశ్వర రావు జాతీయ అవార్డుల ఫంక్షన్ లో ‘నా ఆత్మీయుడు.. నా అన్న లాంటి వ్యక్తి’ అంటూ ఉచ్ఛరించాడు. చిరంజీవి కూడా నాగార్జున తనయుడు అఖిల్ విషయంలో ఇంతే ఆప్యాయత చూపిస్తూంటారు.

 

 

హలో ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అయితే నాగార్జున అంగీకరిస్తే అఖిల్ ను దత్తత తీసేసుకుంటాను అని అనేశారు కూడా. చిరంజీవినాగార్జున మధ్య ఉన్న అనుబంధానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం. అఖిల్ ను చిరంజీవి ఎంతగానో ఇష్టపడతారు. అఖిల్ మొదటి పుట్టినరోజు సందర్భంగా 1995లో భారీ సెలబ్రేషన్ చేశాడు అక్కినేని నాగార్జున. ఆ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు చిరంజీవి. ‘అఖిలాంధ్ర కోటి అక్కినేని అఖిల్’ అంటూ చిరంజీవి ఆరోజు అఖిల్ ను ఉద్దేశించి అన్నారు. అప్పట్లో అన్ని సినీ పత్రికల్లో కూడా ఈ మాట హైలైట్ అయింది. అప్పటి నుంచీ అఖిల్ అంటే చిరంజీవికి ఇష్టం అనే చెప్పాలి.

 

 

మరో పక్క అక్కినేని నట వారసుడిగా అఖిల్ రాణిస్తున్నాడు. చేసిన మూడు సినిమాలు ఫెయిల్యూర్స్ అయినా కానీ.. వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో పూజా హెగ్డేతో రొమాన్స్ చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: