టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ హీరోగా గుర్తింపు పొందాడు. చాలా మంది స్టార్ హీరోలకు దక్కని ఇమేజ్ ను దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ సంపాదించుకున్నాడు. తన యాటిట్యూడ్ తో వార్తల్లో నిలిచే విజయ్ ఇటివల కరోనా పరిస్థితుల్లో కూడా అదే యాటిట్యూడ్ తో విమర్శలకు గురవుతున్నాడు. కరోనా దెబ్బకి ఉపాధి కోల్పోయిన కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు సినీ పరిశ్రమ మొత్తం సాయం చేస్తుంటే విజయ్ మౌనం అనేక విమర్శలకు దారి తీస్తోంది.

 

 

కార్మికుల కష్టాన్ని అర్ధం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వచ్ఛందంగా.. మొదటగా స్పందించి కోటి రూపాయలు ప్రకటించి సీసీసీ అనే చారిటీ సంస్థను ఏర్పాటు చేశారు. చిరంజీవి పిలుపుకు ఇండస్ట్రీ కదిలింది. అనేకమంది హీరోలు, నటులు, నిర్మాణ సంస్థలు విరాళాలు ప్రకటించాయి. ఆ మొత్తంతో కార్మికులకు నిత్యావసరాలు కూడా అందిస్తున్నారు. మరికొంత మంది వ్యక్తిగత సాయం చేస్తూ కార్మికులను ఆదుకుంటున్నారు. మరికొంతమంది నిత్యావసరాలు అందిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. చిరంజీవి పిలుపుకూ స్పందించని విజయ్ తీరును సర్వత్రా తప్పు పడుతున్నారు.

 

 

కనీసం వ్యక్తిగత సాయం కూడా చేయకపోవడంపై నిందిస్తున్నారు. స్టార్ అయ్యాడు కాబట్టి కింది స్థాయి కార్మికుల గోడు పట్టట్లేదా అనే విమర్శలు నెట్టింట్లో హోరెత్తుతున్నాయి. పైగా.. జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు డాక్టర్లే వదిలేయండి అని సోషల్ మీడియాలో కబుర్లు చెప్తున్నాడు. విజయ్ లాంటి హీరో సాయం చేస్తే ఆయన అభిమానులు కూడా సాయానికి ముందుకొస్తారు. సంపూర్ణేశ్ బాబు నుంచి విశ్వక్ సేన్ వరకూ విరాళాలు ప్రకటించారు. మరి విజయ్ మాత్రం ఏమీ పట్టన్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నడో తనకే తెలియాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: