దేశంలో లాక్ డౌన్  ప్రకటించిన తర్వాత అన్ని సినీ పరిశ్రమలో షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే.  దాంతో వేల మంది సినీ కార్మికులు కష్టాల్లో పడ్డారు.  అయితే అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు ఆయాన సినీ పరిశ్రమలో కార్మికులు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.  ఇప్పటికే చిరంజీవి ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే టాలీవుడ్ సినీ కార్మికులకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన మంచి మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన రోజు కూలీ సినీ కార్మికులు 25,000 వేల మందికి తాను అండగా ఉంటానని ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 ఇటీవల ఈ విషయం గురించి ఆయన మాట్లాడారు.. అతి బీద సినీ కార్మికులకు సంబంధి అకౌంట్లు తీసుకొని ఒక్కో కార్మికుడికి రూ.3000 చొప్పున అకౌంట్లో వేశారు.  ఇందుకు సంబంధించిన వివరాలను ఫెడరేషన్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యుఐసీఈ) అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు. రోజు కూలీ సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని సల్మాన్ ఖాన్ నిన్నటి నుంచి ప్రారంభించినట్టు చెప్పారు.  ఇప్పటి వరకు 23,000 మంది సినీ కార్మికులతో కూడిన జాబితాను సల్మాన్ కు అందజేశామని, దాని ప్రకారం ఆయా అకౌంట్లకు మూడు వేల రూపాయల చొప్పున మనీ ట్రాన్స్ ఫర్ చేశారని అన్నారు.  

 

మరోవైపు అమితాబచ్చన్  ఇక కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రజలు తమ వంతు సహాయం అందించాలని కోరుతూ ప్రధాని మోడీ పీఎం కెర్స్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇలా ఒక్కో హీరో తమ వంతు సహాయం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: