మాస్ అంటేనే ఒక లెక్కలో ఉంటుంది స్టోరీ. మరి ఊర మాస్ అంటే అది అరాచకమే అవుతుంది. దుమ్ము రేగ్గొట్టడమే అవుతుంది. దమ్ము చూపించి కొమ్ములు విరిచేయడమే అవుతుంది.  మగవాడు గా కాదు పగవాడుగా మారి తెగనరకడమేంటో చూపిస్తే ఆ నరుకుడుకి నరకం గేట్లు కూడా మూసుకోవాల్సిందే మరి.

 

అల్లు అర్జున్ గంగోత్రితో ఎంట్రీ ఇచ్చినపుడు మామూలు నటుడనుకున్నారు. రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు చేసినపుడు పర్లేదు నిలబడతాడు అని అంచనా కట్టారు. స్టైల్ గా సినిమాలు చేస్తూంటే స్టైలిష్ స్టార్ అనేశారు. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి చేతిలో పడి ఊర మాస్ కి సరైనోడు అనిపించుకున్న తరువాత ఇది కదా అసలైన  మాస్ మసాలా అనిపించేశాడు.

 

ఆ తరువాత అర్జున్ మళ్ళీ అంతకు మించి అన్నట్లుగా సుకుమార్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. టైటిల్ పుష్ప. మరి టైటిల్ చూస్తేనే హాఫ్ కటింగుతో అదిరిపోయేలా ఉంది. అందులోనూ బన్నీ ఫస్ట్ లుక్ చూస్తే కేక అన్నట్లుగా ఉంది. ఈ సినిమా స్టోరీ తీసుకుంటే ఊర మాస్ కి కేరాఫ్ అన్నట్లుగా బన్నీ ఉంటాడని ఇట్టే  చెప్పేయవచ్చుట.

 

అక్రమంగా గంధపు దుంగలు   దొంగిలించే స్మగ్లర్ గా అల్లు అర్జున్ అదరగొట్టడం ఖాయమే మరి. ఈ మూవీలో రఫ్ అంటే ఇదీ అన్నట్లుగా అర్జున్ కనిపిస్తున్నాడు. మళ్ళీ దిగాను, ఊర మాస్ గా వస్తున్నాను. లెక్కలు తేల్చాల్సిందే అని అర్జున్ సవాల్ చేస్తున్నాడు. క్లాసీ లుక్కే కాదు మాస్ గా మరిగిపోయే హీటిస్తాను అంటున్నాడు. 

 

అందుకే పుష్ప ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్. ఇక దీన్ని బట్టి బెట్టెయాల్సిందే. బన్నీ ఎన్ని కోట్లు కొల్లగొడతాడో. బ్లాక్ బస్టర్ హిట్ గా  మూవీ ఊపుడు ఏ రేంజిలో ఉంటుందో. నెక్స్ట్ సమ్మర్ కి వెయిటింగ్ అంటున్నారుగా ఇక్కడ  ఫ్యాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: