అల్లు అర్జున్ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే అలా వైకుంఠపురం లో సినిమాలో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తో త్రివిక్రమ్ మరియు బన్నీ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏప్రిల్ 8 వ తారీకు బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మరియు  టైటిల్ రిలీజ్ చేశారు. సినిమాకి పుష్ప అనే టైటిల్ పెట్టారు. గుబురు గడ్డంతో గుబురు మీసం పెరిగిన జుట్టుతో చాలా ఊర మాస్ క్యారెక్టర్ కలిగిన వాడిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ సినిమాలో ఉండబోతున్న ట్లు అర్థమవుతుంది. సినిమా ఫస్ట్ లుక్ లో చాలా కోపంగా అల్లుఅర్జున్ చూడటంతో...సుకుమార్ ఫుల్ సినిమాలో అల్లు అర్జున్ నీ ఏ విధంగా చూపిస్తారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

ప్రస్తుతం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో  వైరల్ గా మారింది. ప్యాన్ తరహాలో సుకుమార్సినిమా నీ తెలుగు-హిందీ-తమిళం- మలయాళం సహా సౌత్ లో అన్ని భాషల్లో సుకుమార్ తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది. అయితే ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో చాలామంది శుభాకాంక్షలు తెలుపుతూ 'పుష్ప' ఫస్ట్ లుక్ మీద తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ హీరోలు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ పుష్ప ఫస్ట్ లుక్ చూసి డైరెక్టర్ సుకుమార్ కి అదే విధంగా అల్లు అర్జున్ కి  ఫోన్ చేసి విషెస్ చెప్పినట్లు ఫిలింనగర్ లో టాక్. ఈ సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: