ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే  సందర్బంగా తన 20 వ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ టైటిల్ రెండు రోజుల ముందే లీక్ అయ్యింది. అయితే అంతకన్నా ముందే ఈ టైటిల్ ను గత ఏడాదే రివీల్ చేశాడు అల్లు అర్జున్. అది ఎలా అనుకుంటున్నారా.. గత ఏడాది నవంబర్ 27న డైరెక్టర్ సుకుమార్ తో కలిసి దిగిన ఫోటోను బన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ  సుక్కు హెయిర్ కలర్ చేంజ్ అయ్యింది, నా స్కిన్ కలర్ మారింది కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు అని చెప్తూ చివర్లో పుష్ప అనే అర్ధం వచ్చేలా  సింబాలిక్ గా చెప్పాడు. అయితే ఈ పోస్ట్ ను చూసిన  వారెవరు అప్పుడు అంతగా గమనించలేదు కాని ఈరోజు టైటిల్ రిలీజ్ కావడం తో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. 
 
 
 
ఇక బన్ని కెరీర్ లో మొదటి  పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప లో రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా జగపతి బాబు ,తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రతి నాయకులుగా కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని చిత్తూరు యాసలో డైలాగులు చెప్పనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుండగా ఈఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఈ చిత్రం తరువాత బన్ని, ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ లో నటించనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: