మెగా ఫ్యామిలీ నుండి వచ్చి అతి తక్కువ కాలంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరో మెగా మేనళ్లుడు సాయి తేజ్. వరుసగా ఆరు ఫ్లాపులు పడేసరికి కెరియర్ ఏమవుతుందో అని భయపడ్డ సాయి తేజ్ చిత్రలహరితో సక్సెస్ అందుకుని ఆ తర్వాత ప్రతిరోజూ పండుగతో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్న సాయి తేజ్ ఈ సినిమా తవాత దేవా కట్టా సినిమాకు ముహూర్తం పెట్టుకున్నాడు.

 

చిత్రలహరిలో సెకండ్ హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్ దేవా కట్టా డైరక్షన్ లో మూవీ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అర్జున్ అల వైకుంఠపుములో చిన్న పాత్రతో సరిపెట్టుకున్న ఈ అమ్మడు ఈసారి మెగా హీరో పక్కన హీరోయిన్ చెస్ కొట్టేసింది. అయితే ఇక మీదట సాయి తేజ్ తన సినిమాల్లో చిరంజీవి పాటలను రీమిక్స్ చేయకూడదని అనుకున్నాడట. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో గువ్వా గోరింకతో, సుప్రీమ్ సినిమాలో అందం హిందోళం పాటలు రీమిక్స్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. 

 

అయితే వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చమ్మక్ చమ్మక్ చాం పాత రీమిక్స్ చేశారు. ఈ సినిమా డిజాస్టర్ అవగా చిరు పాటకి ఉన్న క్రేజ్ తగ్గేలా చేశారు. అందుకే సాయి తేజ్ ఇక మీదట చిరు పాటల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాడట. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత దేవాకట్టా సినిమా ఈ ఇయర్ ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు ఈ మెగా హీరో.  సాయి తేజ్ జోష్ చూస్తుంటే వరుస సినిమాలతో దుమ్ముదులిపేసేలా ఉన్నాడు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: