టాలీవుడ్ ఇప్పుడు నిర్మాతలు నష్టాల నుంచి బయటపడటానికి గానూ నానా కష్టాలు పడుతున్నారు. దీని నుంచి ఏ విధంగా బయటపడాలో అర్ధం కావడం లేదు. లాక్ డౌన్ ని పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే జరిగితే మాత్రం ఇప్పట్లో సినిమాలు విడుదల అయ్యే అవకాశం కనపడటం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి గానూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నష్టాలు చెప్పినా రాయితీలు ఇచ్చే పరిస్థితి కూడా దాదాపుగా కనపడటం లేదు. 

 

రాజకీయ నాయకులను కలిసి విజ్ఞప్తులు చేసినా సరే బయటపడే ఏ మార్గం లేదు అనేది వాస్తవం. దీనితో ఇప్పుడు చిన్న సినిమాలను యుట్యూబ్ ద్వారా విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. యుట్యూబ్ లో ధర ఇంత అని పెట్టి అప్పుడు సినిమాలను విడుదల చేస్తే కాస్త అయినా నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే భావనలో నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దాదాపు నష్టాల్లో ఉంది. సినిమా విడుదల అయినా సరే అది హిట్ కొడుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఉందీ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. 

 

ఇది పక్కన పెడితే... ఇప్పుడు సినిమాలను విడుదల చేయడానికి గాను ధర కూడా పెట్టాలని భావిస్తున్నారట. త్వరలోనే ఒక చిన్న సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు ఇప్పటికే దీనిపై ఒక స్పష్టత కు కూడా వచ్చారని ఆలస్యం చేస్తే వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉందనే భయం నిర్మాతలకు ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇక పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఏ విధంగా నష్టాల నుంచి బయటకు రావాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నాయి. మరి దీనిని ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: