టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కరోనా కారణంగా ఎన్నో సినిమాలు ఇప్పుడు షూటింగ్ కి నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఇప్పట్లో ఏ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం గాని విడుదల చేసే అవకాశం గాని లేదు. తెలుగులో సినిమా విడుదల అవ్వాలి అంటే కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అంతే పడుతుందో ఇంకా ఎక్కువే పడుతుందో ఎవరూ చెప్పలేరు. 

 

కరోనా కూడా ఇప్పట్లో తగ్గే అవకాశం కనపడటం లేదు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి గానూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కాస్త నష్టం అయితే భరించవచ్చు. ఇప్పుడు వడ్డీలు కట్టడానికి ఆస్తులు అమ్మే పరిస్థితిలో టాలీవుడ్ ఉంది. ఈ తరుణంలో ఇక చిన్న హీరోల తో సినిమాలు చేసే ఆలోచన నుంచి బయటకు రావాలని నిర్మాతలు భావిస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. చిన్న హీరోలతో ఇప్పుడు ముందుకి వెళ్తే మాత్రం నష్టపోతామని భావిస్తున్నారట. 

 

చేస్తే పెద్ద హీరోతోనే చెయ్యాలి గాని ఇప్పుడు చిన్న హీరోలతో చేస్తే నష్టం మినహా లాభం ఉండదు అని వాళ్ళతో సినిమా చేసి ప్రచారానికి ఎక్కువగా ఖర్చు పెట్టి ఇబ్బందులు పడటం కంటే ఆ ఖర్చు తో పెద్ద హీరోతో సినిమా చేస్తే ఏ గోలా ఉండదు అనే భావనలో ఉన్నారు నిర్మాతలు. అందుకే కొంత కాలం పాటు నిర్మాతలు చిన్న హీరోలను పక్కన పెడితే మంచిది అనే భావనలో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చాలా మంది హీరోలు ఇప్పుడు అవకాశాలు రాక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పుడు టాలీవుడ్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: