టాలీవుడ్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చలు అన్నీ కూడా. ఈ సినిమా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటూ టాలీవుడ్ జనాలు ఎక్కువగా చర్చించుకునే పరిస్థితి. ఈ సినిమా కథ విషయంలో కూడా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా కథ ఏ విధంగా ఉంటుంది అనేది తెలియకపోయినా రామ్ చరణ్ మాత్రం అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీమ్ గా నటించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు టాలీవుడ్ జనాల మాట. అందుకే ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి. 

 

ఈ సినిమాలో ఇటీవల రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ఒక టీజర్ ని విడుదల చేసారు. దీనిలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనపడుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్సినిమా చేస్తాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రామ్ చరణ్ ఇప్పుడు కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కాదు అతను పాత దర్శకుడికే అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి అని మరికొందరు అంటున్నారు. కథ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తగా ఉండే రామ్ చరణ్... 

 

ఈ కథ విషయంలో ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నాడట. తనకు ఆర్ఆర్ఆర్ తర్వాత ఇమేజ్ పెరుగుతుంది కాబట్టి ఆ రేంజ్ లోనే సినిమా చెయ్యాలి అనేది అతని ఆలోచన. అందుకే ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేది అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న విషయాలను కూడా అతను చాలా జాగ్రత్తగా చూసుకుని సినిమా చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: