కరోనా వలన ఎక్కువగా నష్టపోయిన రంగం సినిమా రంగం. మేకప్ మాన్ దగ్గర నుంచి అందరూ కూడా భారీగా నష్టపోయారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ లో సినిమాలు లేకపోతే ఎందరో రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలాగే రోడ్డున పడ్డారు వేలాది మంది. ఇక నిర్మాతల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. చాలా మంది నిర్మాతలకు ఆసు ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే ఇప్పుడు హీరోలు కూడా నష్టాల నుంచి బయటకు రావాలని చూస్తున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాలు ఈ ఏడాది విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇక నుంచి ధరలు పెంచి ఇప్పటి నష్టాలను పూడ్చుకునే ఆలోచనలో ఉన్నారు. నిర్మాతలు కూడా టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నారు. దీనితో ఇప్పుడు హీరోలు కూడా తమ తమ నష్టాలను పూడ్చుకోవడానికి గాను ఇప్పుడు సినిమా పారితోషికం పెంచితే మంచిది అనే భావనలో ఉన్నారని తెలుస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల షూటింగ్ కోసం చాలా మంది ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. సినిమా ఫస్ట్ లుక్ వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. 

 

ఇక ఈ కరోనా తర్వాత హీరోలకు డిమాండ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది అందరికి అర్ధమవుతుంది. దాన్ని క్యాష్ చేసుకునే ఆలోచనలో హీరోలు ఉన్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. భారీగా ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఒక అగ్ర హీరో ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. మరి ఎంత పెంచుతారు అనేది తెలియకపోయినా నిర్మాతలకు మాత్రం భారం కావడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: