సూపర్ స్టార్ మహేష్ బాబు సర్రిలేరు నీకెవ్వరు సినిమా విజయంతో మంచి జోష్ మీదున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయం సాధించింది గానీ, ఎక్కడో మహేష్ అభిమానులు సంతృప్తి పొందలేదు. దానిక్కారణం మహేష్ లుక్ ప్రతీ సినిమాలోనూ ఒకే విధంగా ఉండటమే. సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ సినిమా కావచ్చు.. కానీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కింది.

 


నిజానికి మహేష్ మహర్షి సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. సుకుమార్ అప్పటికి రంగస్థలంతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పటి వరకు మనం చూడని రామ్ చరణ్ ని రంగస్థలంలో సుకుమార్ చూపించాడు. ౧౯౮౦ ప్రాంతంలో జరిగిన కథని తెర మీద ఆవిష్కరించిన విధానం అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ అందరూ ఫిదా అయ్యారు.

 

అయితే ఆ సినిమా కాగానే సుకుమార్ మహేష్ కథ వినిపించాడు. కానీ మహేష్ కి అది నచ్చక చేయనని చెప్పాడు. దాంతో సుకుమార్ అదే కథని అల్లు అర్జున్ వద్దకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప అదే అని సమాచారం. పుష్ప ఫస్ట్ లుక్ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఆ లుక్ లో అల్లు అర్జున్ మేకోవర్ ని చూసినవారందరూ షాక్ అవుతున్నారు.

 


లారీ డ్రైవర్ గెటప్ అల్లు అర్జున్ గెటప్ అచ్చు గుద్దినట్లు ఉంది. ఈ లుక్ చూసిన మహేష్ అభిమానులు అప్సెట్ అవుతున్నారు. తమ హీరో చేయాల్సిన సినిమా అటు వెళ్ళిపోయిందని బాధపడుతున్నారు. అలాంటి సినిమా మహేష్ కి వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. మరి సుకుమార్ మహేష్ చెప్పి రిజెక్ట్ అనిపించుకున్న కథ, ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప ఒకటేనా కాదా అన్నది వారిద్దరికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: