టాలీవుడ్ లో పెద్ద కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి దాదాపుగా పది మంది హీరోలు వచ్చారు. వారు అందరూ కూడా ఇప్పుడు తమ తమ సినిమాలతో బిజీ గా ఉన్నారు. టాలీవుడ్ లో వాళ్ళ సినిమాలు ఏదోక సందర్భంలో విడుదల అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా వారి ఫ్యామిలీ నుంచి ఏ సినిమా కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు వాళ్లకు సలహాలు ఇస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. ఇక వరుణ్ తేజ్ తో పాటుగా అల్లు అర్జున్, సాయి ధరం తేజ్ సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. వీరి సినిమాలు ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా అవి వాయిదా పడుతున్నాయి. ఈ నేపధ్యంలో చిరంజీవి ఇక నుంచి చేసే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసినట్టు సమాచారం. ప్రతీ సినిమా కథ కూడా ఒకటికి పది సార్లు చూసి ఓకే చెయ్యాలని రాబోయే రెండేళ్ళు కూడా సినిమాకు చాలా కష్టంగా నడిచే అవకాశం ఉందని ఆయన చెప్పారట. 

 

హీరోలు అందరిని ఇటీవల తన ఇంటికి పిలిచి మరికొన్ని క్లాసులు పీకినట్టు సమాచారం. ఎవరూ కూడా వేగంగా సినిమాలు చెయ్యాల్సిన అవసరం లేదని కూడా వారికి చిరంజీవి చెప్పారని అంటున్నారు. అలాగే అల్లు అరవింద్ కూడా వారికి సలహాలు ఇచ్చారట. నిర్మాతలకు సహకరిస్తే మంచిది అని కూడా ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. నిర్మాతలకు సహకరించకపోతే ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మేసులుకుని సినిమాలు చెయ్యాలని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: