కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. మన తెలుగు రాష్టాల్లో కుడా పోటాపోటీ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు తెలియజేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ పై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో వేసవికాలం వస్తే థియేటర్లలో కొత్త సినిమాల సందడి మాములుగా ఉండదు. అలాంటిది కరోనా వైరస్ గత రెండు వారాలుగా థియేటర్లను మూసి ఉంచేలా చేసింది. ఎల్లప్పుడూ పబ్లిక్ తో కిటకిటలాడే థియేటర్లను మూసివేయడంతో జనాలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా సినిమాలు కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయి విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. వాటిలో రణవీర్ నటించిన '83' ఒకటి. 

 

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో కూడా ఏప్రిల్ 10న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. కరోనా ప్రభావం తగ్గాక కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. ఇక 83 అనే టైటిల్ తో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: