టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల లిస్ట్ ల ప్రముఖంగా వినిపించే పేరు త్రివిక్రమ్‌ శ్రీనివాస్. వరుస స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్న త్రివిక్రమ్‌, సక్సెస్‌ ల పరంగా కాస్త వెనకపడినా క్రేజ్‌ విషయంలో మాత్రం ఎప్పుడూ టాప్‌ లోనే ఉన్నాడు. అయితే అజ్ఞాతవాసి సినిమా తరువాత త్రివిక్రమ్ ఇమేజ్‌ బాగా డ్యామేజీ అయ్యింది. ఆ సినిమాను ఓ ఫ్రెంచ్‌ సినిమాకు ఫ్రీమేక్‌ గా తెరకెక్కించటం.. ఆ సినిమా డిజాస్టర్ కావటంతో త్రివిక్రమ్ టాలెంట్‌ మీద విమర్శలు వినిపించాయి.

 

అ ఆ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ మీద ఇలాంటి విమర్శలే వినిపించాయి. యద్దనపూడి సూలోచనా రాణి నవలను సినిమాగా తెరకెక్కించిన త్రివిక్రమ్ టైటిల్స్‌ లో ఆమెకు క్రెడిట్‌ ఇవ్వకపోవటంపై విమర్శలు వినిపించాయి. ఆ తరువాత వచ్చిన అరవింద సమేత వీర రాఘవ విషయం లో కూడా కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో త్రివిక్రమ్‌ అంటే కాపీ డైరెక్టర్ అన్న ముద్ర పడిపోయింది. తాజాగా అల వైకుంఠపురములో సినిమా మీద కూడా అలాంటి విమర్శలే వచ్చాయి.

 

సినిమా తరువాత ఎన్టీఆర్‌ హీరో గా ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు త్రివిక్రమ్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా మీద కూడా కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ సెటైర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓల్డ్ క్లాసిక్ మంత్రిగారి వియ్యంకుడు సినిమాకు కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే లైన్‌ ను తీసుకొని త్రివిక్రమ్‌ తన దైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: